‘ఖైదీ’,`తంబి` వంటి వరుస విజయాల తర్వాత యాంగ్రీ హీరో కార్తీ నటిస్తోన్న తాజా చిత్రం ‘సుల్తాన్’’. శివకార్తికేయన్ నటించిన ‘రెమో’ చిత్ర దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీకి జోడీగా అందాల భామ రష్మిక మందన్న నటిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా నిర్మాత ఎస్.ఆర్ ప్రభు మాట్లాడుతూ – మా బేనర్‌లో కార్తి హీరోగా నటిస్తోన్న సుల్తాన్ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ రోజు నుండి హైదరాబాద్‌లో డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కార్తి, రష్మికల కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోన్న సుల్తాన్ మా బ్యానర్‌లో అత్యంత భారీ చిత్రంగా నిలుస్తుందని నమ్మకం ఉంది. లాక్‌డౌన్ కాలంలో దొరికిన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ముఖ్యమైన సన్నివేశాల ఎడిటింగ్ పూర్తి చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం“అన్నారు.