‘లవ్‌ స్టోరీ’ షూటింగ్ @ ఆర్మూరు

0
20

యువ‌సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌ స్టోరీ’. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూరులోని నవసిద్ధుల గుట్టపై చిత్రీకరణ జరుగుతోంది. పచ్చదనం పరుచుకున్న అందమైన పట్టణంలో, సహజసిద్ధమైన వాతావరణంలో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌.

ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించిన చిన్న వీడియోను ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇటీవ‌ల‌ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. `ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఆర్మూర్ సిద్ధులగుట్ట నేటి అభివృద్ధికి నిదర్శనం నాగచైతన్య సాయి పల్లవి షూటింగ్ ఈరొజు ఆర్మూర్ సిద్ధులగుట్ట మీద జరగడం గొప్ప మరియు ఆనందకరమైన విషయం` అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here