సుప్రసిద్ధ కళా దర్శకులు శ్రీ ఆనంద సాయికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ అభినందనలు

0
359

యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకులు శ్ర్రీ ఆనంద సాయి ఇటీవలే ‘ధార్మిక రత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన క్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్  శుక్రవారం సాయంత్రం శ్రీ ఆనంద సాయిని అభినందించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో శ్రీ ఆనంద సాయిని శాలువాతో సత్కరించి – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం అన్నారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ధార్మిక రత్న పురస్కారం దక్కడం సముచితం అని చెప్పారు. నటులు శ్రీ నర్రా శ్రీను ఈ సత్కారంలో పాల్గొని అబినందనలు తెలియచేశారు.

శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఇటీవల హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియమ్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీ ఆనంద సాయి ‘ధార్మిక రత్న’ పురస్కారం స్వీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here