గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ రాజీషా విజయన్

0
475
హీరోయిన్ రాజీషా విజయన్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహాద్భుతంగా ముందుకు కొనసాగుతోంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు కేరళ లోని తన నివాస సముదాయం మూడు మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ రాజీషా విజయన్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా హీరోయిన్ రాజీషా విజయన్ మాట్లాడుతూ నాకు మొక్కలు అంటే చాలా ఇష్టమని కానీ మా ఇంటి ప్రదేశంలో ఖాళీ స్థలం లేని కారణంగా నేను ఇష్టంతో ఈ పండ్ల మొక్కలను మా ఇంటి బాల్కనీలో పెట్టుకోవడం జరుగుతుంది అని వీటిని సంరక్షించే బాధ్యత కూడా నీనే తీసుకుంటానని తెలిపారు. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని దీనిని ప్రతి ఒక్కరూ స్వీకరించి మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here