కమర్షియల్ చిత్రాలతో పాటు ఇతిహాస పౌరాణిక చారిత్రక నేపథ్యం గల చిత్రాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్. అద్భుతమైన టేకింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే గుణశేఖర్.. ‘రామాయణం’ ‘రుద్రమదేవి’ సినిమాలను వెండితెరపై ఆవిష్కరించారు.
రుద్రమదేవి’తో దర్శకనిర్మాతగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న డైనమిక్ ప్రొడ్యూసర్ గుణశేఖర్ రచన, దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పౌరాణిక చిత్రం `శాకుంతలం`. హై బడ్జెట్ మరియు అత్యాదునిక సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని గుణా టీమ్ వర్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మెలొడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. `
సాయంత్రం 7.11 గంటలకు బిగ్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రకటించిన గుణశేఖర్..”వెండితెరపై ‘హిరణ్యకశ్యప’లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు… భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ…” అని ప్రకటించారు. ‘మరచిపోయిన ప్రేమ.. మరచిపోలేని ప్రేమ కథ’ అని మోషన్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
మెలొడి బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతంతో ఈ మోషన్ పోస్టర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. భారీ తారాగణంతో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.



