ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై ప్రొడక్షన్ నెం.1గా వెంకటేష్ త్రిపర్ణ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం `పీనట్ డైమండ్`. అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. `బెంగాల్ టైగర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. జె. ప్రభాకర రెడ్డి ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఒక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఈరోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా.. నిర్మాతలు అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ మాట్లాడుతూ – “ రెండు కాలమాణాలకి సంబందించిన ఒక విభిన్న కథాంశంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేవిధంగా ఈ మూవీ రూపొందుతోంది. 1989లో ఒక కథ జరుగుతూ ఉంటే దానికి ప్యారలల్‌గా 2020లో మరోక కథ రన్ అవుతూ ఉంటుంది. ఆ రెండు కథలకి సంభందం ఏంటి? అలాగే పీనట్ డైమండ్ అని విభిన్నమైన టైటిల్ ఎందుకు పెట్టాం? అనే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఖచ్చితంగా ఆడియన్స్‌కి ఒక మంచి అనుభూతినిచ్చే చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి సంబందించి మొదటి షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మిగిలిన రెండు షెడ్యూల్స్ తమిళనాడు, కేరళ, వైజాగ్ లో జరుపనున్నాం. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం.“ అన్నారు.
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫి: జె. ప్రభాకర రెడ్డి,
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఫైట్స్: శంకర్.యు,
లైన్ ప్రొడ్యూసర్: శ్రీనిధి నక్కా,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శాని సాల్మాన్,
నిర్మాతలు : అభినవ్ సర్ధార్,వెంకటేష్ త్రిపర్ణ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకటేష్ త్రిపర్ణ.