`రుద్రమదేవి` విజయంలో భాగమైన అందరికీ ధన్యవాదాలు – డైన‌మిక్‌ డైరెక్టర్ గుణశేఖర్‌

0
58

కాకతీయ రాజ్యాధినేత రాణీ రుద్రమదేవి జీవితగాథను డైన‌మిక్‌ డైరెక్టర్ గుణశేఖర్‌ దర్శక నిర్మాణంలో ‘రుద్రమదేవి’గా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 9, 2015న తెలుగు,తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం నేటితో ఐదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత గుణశేఖర్‌ సినిమా ఘనవిజయంలో భాగమైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

“రుద్రమదేవి ప్రయాణం నాకెంతో స్పెషల్‌. అల్లుఅర్జున్‌, రానా దగ్గుబాటి ఈ ప్రయాణాన్ని ఇంకా అద్భుతంగా మలిచారు. ఈ గొప్ప చరిత్రను వెండితెరపై ఆవిష్కరించిన గుణశేఖర్ గారికి ఆయన టీమ్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు అనుష్క.

స్టార్ హీరోయిన్‌ అనుష్క టైటిల్‌పాత్ర షోషించగా.. చాళుక్యవీరభద్రుడి పాత్రలో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ రానా దగ్గుబాటి, గోనగన్నారెడ్డిగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించారు. భారీ బడ్జెట్‌తో హిస్టారికల్‌ త్రీడీ మూవీగా సినిమా రూపొందిన ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రలో అనుష్క ఒదిగిపోయిన తీరు, గోనగన్నారెడ్డిగా తెలంగాణ యాసలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్స్‌, మేకింగ్‌, ఇతర సాంకేతిక అంశాలకు మంచి ఆదరణ లభించింది. మేస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here