సూపర్ హిట్ చిత్రాల నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తమ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై పవన్ కుమార్ సమర్పణలో ప్రొడక్షన్ నెం: 4 గా ‘బ్లాక్ రోజ్’ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు సార్లు మిస్ యూనివర్స్ ఇండియా గా గెలుపొందిన అందాల తార ఊర్వశి రౌతేల హీరోయిన్ గా నటిస్తున్న ‘బ్లాక్ రోజ్’ ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈమధ్యనే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించింది. నేడు చిత్ర బృందం ‘నా తప్పు ఏమున్నదబ్బా’ అంటూ సాగే ప్రమోషనల్ వీడియో సాంగ్ ని విడుదల చేసింది. ఈ సాంగ్ ని మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ ఈ రోజు (సెప్టెంబర్ 30) సా 4:24 కి విడుదల చేశారు. సోనీ మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదలైంది.
ఈ ప్రమోషనల్ సాంగ్ లో హీరోయిన్ ఊర్వశి రౌతేల తన అందం తో పాటు అద్భుతమైన డాన్స్ స్టెప్స్ తో విశేషంగా ఆకట్టుకున్నారు. 4 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ పాటకి జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. స్వతహాగా మంచి డాన్సర్ అయినా ఊర్వశి ఈ సాంగ్ లో కష్టమైన డాన్స్ మూవ్ మెంట్స్ తో అలరించడం విశేషం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ డాన్స్ స్టెప్స్ స్ఫూర్తిగా కంపోజ్ చేసిన డాన్స్ కి రిహార్సల్స్ చేస్తూ ఊర్వశి పలుమార్లు గాయపడినా నేర్చుకుని చేయడం తనకి ప్రొఫెషన్ పట్ల ఉన్న డెడికేషన్ కు అద్దం పడుతోంది. ఈ పాట ఆడియన్స్ కు ట్రీట్ లా ఉంటుంది.
ఊర్వశి రౌతేల మాట్లాడుతూ, ” నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. బ్లాక్ రోజ్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమా నటిగా నాలో ఇంకో కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఇవ్వడమే కాకుండా చాలా కష్టమైన డాన్స్ నేర్చుకుని చేసే అవకాశం ఇచ్చింది. ఈ పాట షూట్ చేయడానికి ముందు చాలా రిహార్సల్స్ చేసాను. దెబ్బలు కూడా తగిలాయి కానీ పాట పూర్తయ్యాక చూసినప్పుడు ఆ కష్టమంతా మర్చిపోయాను. పాట అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ ఎప్పుడెప్పుడు చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంపత్ నంది గారికి, శ్రీనివాసా చిట్టూరి గారికి కృతజ్ఞతలు.”
మణి శర్మ కంపోజ్ చేసిన ఈ పాటని తెలుగు, హిందీ భాషల్లో హారిక నారాయణ్ పాడారు. తెలుగు పాటని సంపత్ నంది రాయగా హిందీ వెర్షన్ ని వనిత గుప్త రాశారు.
షేక్స్ పియర్ రచించిన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’ లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ‘బ్లాక్ రోజ్’ తెరకెక్కుతోంది. ‘విచక్షణ లేని యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థ శాస్త్రం లోని కాన్సెప్ట్ తో ‘బ్లాక్ రోజ్’ రూపొందింది. ఆగష్టు లో ప్రారంభమైన ఈ చిత్రం తెలుగు. హిందీ భాషల్లో ఒకే షెడ్యూల్ లో ఏకధాటిగా షూటింగ్ జరుపుకుని నిర్మాణం పూర్తి చేసుకుంది.
రచన: సంపత్ నంది, మోహన్ భరద్వాజ్
ఆర్ట్ డైరెక్టర్: ఆచార్య సత్యనారాయణ
ఎడిటర్: తమ్మిరాజు
డి ఓ పి: సౌందర్ రాజన్
సంగీతం: మణిశర్మ
సమర్పణ: పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
క్రియేటెడ్ బై: సంపత్ నంది
దర్శకత్వం: మోహన్ భరద్వాజ్
Hello Young India! This is @UrvashiRautela 💃🏻 from #BlackRose🌹 #HaiKyaYeMeraKasoor
➡️ https://t.co/BVmnjgkjUZA #ManiSharma Musical 🎵@IamSampathNandi @SS_Screens @mohanbharadwaja @sonymusicindia @AlwaysJani @soundar16 #SSS4 pic.twitter.com/91ccwmCr9O
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 30, 2020
Hello South India! This is @UrvashiRautela 💃🏻 from #BlackRose🌹 #NaaTappuEmunnadabbaa
👉🏼 https://t.co/UL7aAeH8ASA #ManiSharma Musical 🎵@IamSampathNandi @SS_Screens @mohanbharadwaja @SonyMusicSouth @AlwaysJani @soundar16 #SSS4 pic.twitter.com/neuljDKWuc
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 30, 2020
Happy to release this for my guru shri #manisharma gaaru ❤️▶️🤍
God bless the whole team #NaaTappuEmunnadabbaa from #BlackRose . All the best to the team 😊
➡️ https://t.co/IH0SBPjSkt@IamSampathNandi @urvashirautela @sonymusicsouth @SS_Screens @mohanbharadwaja #ManiSharma
— thaman S (@MusicThaman) September 30, 2020