జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎమ్.రమేష్, ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో ఎస్.పి.బి కి స్వర నీరాజనం!!

0
82

కారణజన్ముడు-గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి స్వర నీరాజనం అర్పించింది తెలంగాణ పోలీసు శాఖ. హైద్రాబాద్ లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్ వేదికగా ప్రముఖ నటుడు లోహిత్ ఆధ్వర్యంలో.. సాగిన ఈ స్వర నివాళికి జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎం.రమేష్, ఐ.పి.ఎస్ సారధ్యం వహించారు. 27 మధ్యాహ్నం మూడు గంటల నుంచి… రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమంలో ఎం.రమేష్ స్వయంగా రెండు పాటలు ఆలపించడం విశేషం.

ప్రముఖ సంగీత దర్శకులు కోటి, విశ్రాంత ఐ.ఏ.ఎస్.అధికారి ఎల్.వి.సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో… 19 భాషల్లో 90 వేల పాటలు పాడి, భారతీయ సంగీతంపై చెరగని ముద్ర వేసిన ఎస్పీబీకి ‘భారతరత్న’ ఇవ్వాలని వక్తలు విజ్ఞప్తి చేశారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here