నాని మరియు సుధీర్ బాబు నటించిన తెలుగు యాక్షన్-థ్రిల్లర్ ‘వి’ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, కన్నడ మరియు మలయాళ భాషలలో ప్రసారం అవుతోంది

0
94

మోహన కృష్ణ ఇంద్రగంటి రచన మరియు దర్శకత్వం వహించిన ఈ తెలుగు థ్రిల్లర్ లో ‘నేచురల్ స్టార్’ నాని ప్రధాన పాత్రలో నటించారు, సుధీర్ బాబు, నివేదా థామస్ మరియు అదితి రావు హైదరి ప్రముఖ పాత్రల్లో నటించారు

భారతదేశంలో మరియు 200 దేశాలు మరియు టెర్రిటోరియాస్ లో ఉన్న ప్రైమ్ సభ్యులు సెప్టెంబర్ 5 న విడుదల అవుతున్న తెలుగు టైటిల్ V యొక్క డిజిటల్ ప్రీమియర్‌ను ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.

సరికొత్త మరియు ప్రత్యేకమైన చలనచిత్రాలు, టీవీ షోలు, స్టాండ్-అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా ప్రకటన-రహితంగా మ్యూజిక్ వినడం కోసం, భారతదేశపు అతిపెద్ద ఉత్పత్తుల ఎంపికపై ఉచిత, వేగవంంతమైన డెలివరీ, టాప్ డీల్స్ యాక్సెస్, ప్రైమ్ రీడింగ్‌తో అపరిమితమైన పఠనం మరియు ప్రైమ్ గేమింగ్‌తో మొబైల్ గేమింగ్ కంటెంట్ అమెజాన్ ద్వారా పొందవచ్చు. ఇవన్నీ కేవలం నెలకు 129 రూపాయల అద్భుతమైన విలువతో అమెజాన్ ప్రైమ్ మీకోసం అందిస్తుంది.

నాని, సుధీర్ బాబు నటించిన తెలుగు థ్రిల్లర్ ‘వి’ చిత్రం ప్రేక్షకుల నుండి ఎంతో ప్రేమను పొందింది. నాని యొక్క 25’వ చిత్రం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న అభిమానులు, సూపర్ కాప్ పాత్రలో సుధీర్ బాబుతో కలిసి కొన్ని హై-ఆక్టేన్ చేజ్ సన్నివేశాలను ప్రదర్శించిన ‘నేచురల్ స్టార్’ యాక్షన్ చూడటానికి వారి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. వారి నుండి వస్తున్న ప్రేమను రెట్టింపు చెయ్యడానికి, అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పుడు తమిళం, మలయాళం మరియు కన్నడ ఆడియోలతో ‘వి’ చిత్రాన్ని విడుదల చేసింది. ఇప్పుడు ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో ప్రసారం కావడానికి అందుబాటులో ఉంది.

ఈ నిర్ణయంపై నటుడు నాని మాట్లాడుతూ, “- మా చిత్రాన్ని తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో ప్రసారం చేయడం వల్ల అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా మా అభిమానులు వారి ఇంటిలో సౌకర్యంలో, తమ సొంత భాషలలో సినిమాను ఆస్వాదించగలుగుతారు. ఇది మా అభిమానులకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది మరియు మేము సినిమా తీస్తున్నప్పుడు ఎంతయితే ఆనందించామో అంతగా వారు కూడా ఈ సినిమాను చూస్తూ ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము. ”

“వి సినిమా ఎల్లప్పుడూ నాకు చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్ మరియు ఇప్పటివరకు అందుకున్న స్పందన చాలా బాగుంది” అని దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి అన్నారు. “మా తెలుగు ప్రేక్షకులు మా చిత్రానికి అపారమైన ప్రేమను కురిపించారు మరియు ఈ చిత్రం కోసం తమిళం, కన్నడ మరియు మలయాళ డబ్‌లతో మాపై ఉన్న అభిమానాన్ని విస్తరించడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఈ హై-ఆన్ యాక్షన్ థ్రిల్లర్‌తో వీలైనంత ఎక్కువ మందిని అలరించాలని నేను ఆశిస్తున్నాను. ”

ఒక క్రైమ్ రచయితతో ప్రేమలో పడిన ఒక పోలీసు, ఎంతో ఆనందంతో నిండిన అతని జీవితంలో, ఒక కిల్లర్ ప్రవేశించడంతో, అతనికి ఎదురయిన ఒక పజిల్‌ను పరిష్కరించడం కోసం ఎదుర్కొంటున్న సవాళ్లతో ఆయన జీవితం కొత్త మలుపులు తీసుకుంటుంది. మంచికి చెడుకి మధ్య జరిగే షోడౌన్, హెవీ-డ్యూటీ యాక్షన్, ఉల్లాసభరితమైన రొమాన్స్ మరియు హాస్యంతో కూడిన ఈ డ్యూయె పరిణామాలను తెలిపే విధంగా ట్రైలర్ ఉంది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘నేచురల్ స్టార్’ నాని, సుధీర్ బాబు ముఖ్య పాత్రల్లో నటించారు, నివేత థామస్ మరియు అదితి రావు హైదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తెలుగు యాక్షన్ థ్రిల్లర్, ‘నేచురల్ స్టార్’ నానికి పరిశ్రమలో 25 వ చిత్రంతో పాటు విలన్ గా నటించిన మొదటి చిత్రం. భారతదేశంలో మరియు 200 దేశాలు మరియు టెర్రిటోరియాస్ లో ఉన్న ప్రైమ్ సభ్యులు సెప్టెంబర్ 5 న విడుదల అవుతున్న మొదటి స్టార్-స్టడెడ్ తెలుగు చిత్రం ‘వి’ యొక్క డిజిటల్ ప్రీమియర్‌ను వీక్షించవచ్చు.

‘వి’ చిత్రం ప్రైమ్ వీడియో కేటలాగ్‌లో హాలీవుడ్ మరియు బాలీవుడ్ నుండి వేలాది టీవీ షోలు మరియు సినిమాల జాబితాలో చేరనుంది. భారతీయ చిత్రాలైన గులాబో సీతాబో, శకుంతల దేవి, పొన్మగల్ వంధల్, లా, ఫ్రెంచ్ బిర్యానీ, సుఫియం సుజాతాయమ్ మరియు పెంగ్విన్లతో పాటు భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజినల్ సిరీస్ బండిష్ బండిట్స్, బ్రీత్: ఇంటు ది షాడోస్, పాటల్ లోక్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, ది ఫ్యామిలీ మ్యాన్, ఇన్ సైడ్ ఎడ్జ్, మరియు మేడ్ ఇన్ హెవెన్ మరియు టామ్ క్లాన్సీ యొక్క జాక్ ర్యాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లీబాగ్ మరియు ది మార్వెలస్ మిసెస్ మైసెల్ వంటి అవార్డు గెలుచుకున్న మరియు విమర్శకుల ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అదనపు ఖర్చు లేకుండా ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ మరియు బెంగాలీ భాషలలో అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ టీవీలు, మొబైల్ పరికరాలు, ఫైర్ టివి, ఫైర్ టివి స్టిక్, ఫైర్ టాబ్లెట్లు, ఆపిల్ టివి, ఎయిర్‌టెల్, వొడాఫోన్ మొదలైన వాటి కోసం అందుబాటులో ఉన్న ప్రైమ్ వీడియో యాప్‌లో ప్రైమ్ సభ్యులు ‘వి’ చిత్రాన్ని ఎక్కడైనా మరియు ఎప్పుడైనా చూడగలరు. ప్రైమ్ వీడియో అనువర్తనంలో, ప్రైమ్ సభ్యులు వారి మొబైల్ పరికరాలు మరియు టాబ్లెట్‌లలో ఎపిసోడ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు అదనపు ఖర్చు లేకుండా ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా చూడవచ్చు.

ప్రైమ్ వీడియో భారతదేశంలో సంవత్సరానికి ₹999 లేదా నెలకు ₹129 తో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా లభిస్తుంది, కొత్త కస్టమర్లు www.amazon.in/prime పై క్లిక్ చెయ్యడం ద్వారా మరింత తెలుసుకోవచ్చు మరియు 30 రోజుల ఉచిత ట్రయల్‌కు సుబ్స్క్రిప్షన్ పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here