ప్యాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో 3 స్థానం దక్కించుకున్న విజయ్ దేవరకొండ

0
362
విజయ్ దేవరకొండ మెస్ట్ డిజైరబుల్ మెన్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యూత్ లో అతనికున్న ఫాలోయింగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. తెలుగులోనే కాదు నేషనల్ లెవల్ లో కూడా విజయ్ సత్తా చాటుతున్నాడు.రీసెంట్ గా ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ దక్కించుకున్న ఫస్ట్ సౌత్ హీరోగా రికార్డు కొట్టిన విజయ్ ఇప్పుడు మరో మైలురాయి అందుకున్నాడు. ఇండియాలోని టాప్ 50 మెస్ట్ డిజైరబుల్ మెన్ ల లిస్ట్ లో విజయ్ దేవరకొండ ఏకంగా మూడు స్థానం దక్కించుకోవడం విశేషం.మొదటి స్థానంలో షాహిద్ కపూర్,,రెండో స్థానం లో రణ్ వీర్ సింగ్ ఉండగా మిగతా బాలీవుడ్ హీరోలను కిందకు నెట్టి విజయ్ మూడో స్థానం సొంతం చేసుకున్నాడు.

ఇంతకుముందు హైదరాబాద్ మెస్ట్ డిజైరబుల్ మెన్ గా వరుసగా 2018,2019 సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ లో టాప్ 3 ప్లేస్ కైవసం చేసుకోవటం అతని క్రేజ్ కు నిదర్శనం. అతను చేసిన సినిమాలకు ,తన అటిట్యూడ్ కు నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ అవుతున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ సినిమా పై భారీ అంచనాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here