విప్లవ కథానాయకుడు ‘రెడ్ స్టార్’ కామ్రేడ్ మాదాల రంగారావు స్వయంగా కథను సమకూర్చి నటించి- స్వీయ సారధ్యంలో నిర్మించగా అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించి… ఉవ్వెత్తున కదిలించి సంచలన విజయం సాధించిన Trend-setting Land Mark Film ‘యువతరం కదిలింది’ విడుదలై నేటికి 40 ఏళ్ళు. ధవళ సత్యం దర్శకత్వం వహించారు.
1980 ఆగస్టు 15 న విడుదలైన ఈ చిత్రం ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డు అందుకోవడంతో పాటు ఉత్తమ కథా రచయితగా మాదాలకు ఉత్తమ నటుడిగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డికి కూడా నంది అవార్డులు తెచ్చిపెట్టింది! అప్పటి రాష్ట్రపతి స్వర్గీయ నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేకంగా వీక్షించి ప్రశంసించిన ఈ చిత్రం ‘సితార, కళాసాగర్’ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను సైతం అందుకొంది!!



