జ‌న‌సేనానితో భాజ‌పా నూత‌న అధ్య‌క్షుడు సోము వీర్రాజు భేటీ

0
76

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భాజ‌పా అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఈ గురువారం మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ని హైద‌రాబాద్ లో క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పై ముచ్చ‌టించారు. అంతేకాదు.. జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ ప్ర‌ణాళిక‌ల‌కు సంబంధించిన కీల‌క అంశాల్ని ఈ భేటీలో ముచ్చ‌టించారు.

ముఖ్యంగా ఆ ఇద్ద‌రి భేటీలో ఆంధ్ర ప్ర‌దేశ్ అభివృద్ధి అంశంపైనే చ‌‌ర్చ సాగింది. ఆర్థికంగా సామాజికంగా నిర్మాణాత్మ‌కంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ద‌డానికి ప్ర‌ణాళికా బ‌ద్ధ‌మైన ప్లాన్ చేసేందుకు ఈ క‌ల‌యిక అని తెలుస్తోంది. త్వ‌ర‌లో ఉభ‌యులు స‌మావేశ‌మై 2024 ఎన్నిక‌ల్లో ఒక బ‌ల‌మైన శ‌క్తిగా అధికారంలోకి వ‌చ్చే ప్ర‌ణాళిక‌ల్ని రూపుదిద్ద‌నున్నారు‌. అలానే రాజ‌ధాని మార్పు స‌హా అమరావ‌తిలోని రైతులు స‌మ‌స్య‌ల‌పైనా ర‌క‌ర‌కాల‌ అంశాల్ని చ‌ర్చించాల‌‌ని ప‌వ‌న్ – వీర్రాజు ఇద్దరు నిర్ణ‌యించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here