గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను స్వీకరించిన హీరోయిన్ భూమికా చావ్లా

0
436
Bhumika chawla

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి డైరెక్టర్ సంపత్ నంది , హీరోయిన్ భూమికా చావ్లాకు ఛాలెంజ్ విసిరారు. డైరెక్టర్ సంపత్ నంది ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన భూమికా చావ్లా ఈ రోజు తన నివాసంలో తన కుటుంబసభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు.

అనంతరం భూమికా చావ్లా మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని, పెరిగిపోతున్న కాలుష్యానికి బ్రేక్ వేయడానికి ఇది ఒక వెపన్ లా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు తన అభిమానులందరి ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను ముందుకు తీసుకుపోయేలా.. ప్రతి ఒక్క అభిమాని మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చింది. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here