రెబల్ స్టార్ ప్రభాస్ 20వ సినిమా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్లు కలిసి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.
ఇకపోతే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ని ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అఫీషియల్ గా ఒక ప్రకటన చేసారు. ఎప్పటినుండో ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా పండుగ వార్తే అని చెప్పాలి. కాగా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ రాబోయే మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది…..!!