సూపర్ స్టార్ మహేష్ బాబు తనతో కలిసి పని చేసేవారితో పాటు తన వద్ద పనిచేసే వారికి కూడా ఎంతో గౌరవం ఇస్తుంటారు. నేడు తన పర్సనల్ మేకప్ మ్యాన్ పట్టాభికి మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు.
‘ఎప్పుడు ఎక్కడ షూటింగ్ ఉన్నా సరే అది ముగిసే ఆఖరి నిమిషం వరకు కూడా తనతో ఉండి ఎంతో ఓపికగా మేకప్ చేసే పట్టాభికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మహేష్ తన పోస్ట్ లో తెల్పడం జరిగింది.