5 మిలియ‌న్స్ వ్యూస్‌ని క్రాస్ చేసి ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోన్న‌ యాక్ష‌న్ హీరో విశాల్ `చ‌క్ర` ట్రైల‌ర్‌

0
55
Vishal's Chakra Trailer Crosses Whopping 5+ Million Views

తెలుగు,త‌మిళ‌,మ‌ల‌యాళ‌,క‌న్న‌డ నాలుగు ద‌క్షినాది భాష‌ల్లో ఒకేసారి యాక్ష‌న్‌ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ `చ‌క్ర‌` ట్రైల‌ర్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్‌‌ డైలాగ్స్ తో ఉత్కంఠ‌భ‌రితంగా సాగే ఈ ట్రైల‌ర్ విడుద‌లైన అన్ని భాష‌ల‌లో ట్రెమండ‌స్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే 5 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్‌ని దాటి సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సంద‌ర్భంగా `చ‌క్ర‌` ట్రైల‌ర్ ని ఆద‌రిస్తున్న వారంద‌రికి విశాల్ ద‌న్య‌వాదాలు తెలిపారు. బ్యాంక్ రాబ‌రీ, హ్యాకింగ్‌, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో సరికొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన `చ‌క్ర` పోస్ట‌ర్, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. హీరోయిన్‌గా పోలీస్ ఆఫిస‌ర్ పాత్ర‌లో శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

యాక్ష‌న్ హీరో విశాల్‌, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి : బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌,ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here