డాక్ట‌ర్లే దేవుళ్లు..వారికి శుభాకాంక్ష‌లు: డా. యు.వి.కృష్ణంరాజు

0
59
Rebel star Krishnam Raju wishes to doctors on the occasion of world doctors day

‘వైద్యో నారాయణో హరి’ అన్నది భారతీయ సంస్కృతి. వైద్యుడు భగవంతుడితో సమానం. తల్లిదండ్రులను జన్మనిస్తే వారు పునర్జన్మను ఇస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై వైద్యులే ముందుండి పోరాటం చేసి ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడుత‌న్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సంద‌ర్భంగా వైద్యులంద‌రికీ రెబ‌ల్ స్టార్ డా. యు.వి.కృష్ణంరాజు శుభాకాంక్ష‌లు అందించారు. “దేశానికి ర‌క్ష‌ణ మీరు. మీరు బావుంటే ప్ర‌జ‌లంతా బావుంటారు. ప్ర‌జ‌లంతా బావుంటే దేశ‌మంతా బావుంటుంది. డాక్ట‌ర్స్ డే శుభాకాంక్ష‌లు“ అని తెలిపారు.

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌పై వైద్యులే ముందుండి పోరాటం చేస్తున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రాణాలను కాపాడుతున్నారు. ప్రాణాలను అడ్డుగా పెట్టి అనారోగ్యం పాలవుతామని తెలిసినా ప్రజలకు వైద్యం అందించి కాపాడుతున్నారు. పీపీఈ కిట్లతో ఒళ్లంతా ఉక్కిపోతున్నా వృత్తిపట్ల అంకితభావంతో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నారు.. అందుకు ధ‌న్య‌వాదాలు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here