ఆరోగ్యసేతు యాప్ ని అందరూ తప్పక ఉపయోగించండి : సూపర్ స్టార్ మహేష్

0
21
Superstar Mahesh's Valuable Message During Current COVID Situation

ఇప్పటికే మన దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేయడంతో కరోనా కేసులు రోజురోజుకు మరింతగా పెరుగుతున్నాయి. దానితో ప్రజలు ఎక్కడికక్కడ మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు ప్రముఖులు కోరుతున్నారు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విషయమై ప్రజలను అప్రమత్తం గా ఉండాలని కోరుతూ కాసేపటి క్రితం ట్వీట్ చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎక్కడికక్కడ సామాజిక దూరం పాటించడంతో పాటు ప్రభుత్వం వారు సూచించిన ఆరోగ్యసేతు యాప్ ని తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు కరోనా పాజిటివ్ కేసుల అలర్ట్స్ ని పొందడం, మనకు దగ్గర్లో వ్యాధి సోకిన వారు ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవడంతోపాటు హెల్త్ కేర్ ఎమెర్జెన్సీ సెంటర్ల వివరాలు కూడా తెలుసుకొనవచ్చని సూపర్ స్టార్ మహేష్ తన పోస్ట్ లో ప్రజలను అప్రమత్తం గా ఉండాలని తెలిపారు. ఇకపాతే రాబోయే మరికొద్దిరోజుల్లో మహేష్ తన నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాటలో నటించనున్న విషయం తెలిసిందే……!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here