మరొక చిన్నారిని ఆదుకున్న మహేష్ బాబు

0
541
Superstar Mahesh saved another Girl

సూపర్ స్టార్ మహేష్ బాబు తన వంతుగా వీలైన పలు సామజిక, సేవాకార్యక్రమాలు చేపడుతుంటారనే విషయం తెలిసిందే. ఇప్పటికే తన దయార్ద్ర హృదయంతో దాదాపుగా 1000 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిన సూపర్ స్టార్, నేడు మరొక చిన్నారి జీవితంలో సరికొత్త వెలుగుని నింపి మరొక్కసారి తన గొప్ప మనసు ని చాటుకున్నారు.

నెల రోజుల క్రితం జన్మించిన తమ బాలుడికి హృదయ సంబంధిత సమస్య తలెత్తడంతో ఒక యువ జంట, తమకు తెలిసిన స్థానిక మహేష్ బాబు అభిమాన సంఘం వారి ద్వారా సూపర్ స్టార్ మహేష్ బాబు వద్దకు విషయాన్ని తీసుకెళ్లడంతో, వెంటనే చిన్నారి సమస్య విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆంధ్ర హాస్పిటల్స్ వారి సాయంతో ఆ చిన్నారికి ఉచితంగా ఉండే ఆపరేషన్ చేయించి గొప్ప మనసు ని చాటుకున్నారు. ఆపరేషన్ సక్సెస్ అవడంతో ఆ బాలుడి తల్లితండ్రులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆంధ్ర హాస్పిటల్స్ వారికి, అలానే ప్రత్యేకంగా సూపర్ స్టార్ మహేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here