గత కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు విప్పడంతో ఇతర దేశాల మాదిరిగా మన దేశాన్ని కూడా రెండున్నర నెలల నుండి లాక్ డౌన్ లో ఉంచిన విషయం తెలిసిందే. దానితో పలు ఇతర రంగాలతో పాటు టివి, సినీ రంగంలోని షూటింగ్స్ అన్ని కూడా నిలిపివేయబడ్డాయి. కాగా ఎట్టకేలకు నేటి నుండి టివి, సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చని, అయితే కొద్దిపాటి ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించాలని సీఎం కేసీఆర్ నిన్న దానికి సంబందించిన ఫైలు పై సంతకం చేయడం జరిగింది. దానితో సినిమా పరిశ్రమ నుండి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఇకపోతే కాసేపటి క్రితం ఈ విషయమై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. “వేలాది మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువుని దృష్టిలో ఉంచుకుని సినిమా,టీవీ షూటింగ్స్ కి అనుమతి మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి,విధి విధానాలు రూపొందించి సహకరించిన శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, ప్రభుత్వాధికారులకు కృతజ్ఞతలు.Thank You Sir ” అంటూ మెగాస్టార్ పోస్ట్ చేయడం జరిగింది. కాగా మెగాస్టార్ పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…. !!



