ఇట్స్ టైం ఫర్ నేచర్.. పర్యావరణాన్ని రక్షించండి. సుర‌క్షితంగా ఉండండి – సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు.

0
626
సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ స్పంద‌న

నేడు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. అభివృద్ధి అంటూ మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా గాలి, నీరు, నిప్పు, నేల, నింగి అనే పంచభూతాల వలనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మాన‌వ మ‌నుగ‌డ అస్తవ్యస్తమవుతుంది. రోజురోజుకూ భూగోళంపై పచ్చదనం తగ్గిపోవడం.. కొన్ని రకాల జీవరాశులు నశించిపోవడం వలన పర్యావరణానికి పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ప్రకృతి గొప్పదనం చెప్పడానికి.. పర్యావరణాన్ని రక్షించాలని ప్రతీ ఏటా జూన్ 5న అవగాహన కలిగిస్తుంటారు. ప్రతి ఏడాది ఒక్కో థీమ్ తో ఎన్విరాన్మెంట్ సదస్సులను నిర్వహిస్తూ ఉంటారు. గతేడాది ‘బీట్ ఎయిర్ పొల్యూషన్’ పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ ఏడాది ”ఇట్స్ టైం ఫర్ నేచర్” థీమ్ ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ ‌బాబు ‘మనమందరం నివసించే పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి వ్యక్తిగత బాధ్యత ఇట్స్ టైం ఫర్ నేచర్ – అంటూ దలైలామ కొటేషన్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

మనము, ప్రకృతి ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాము. ప్రకృతిని రక్షించడం ద్వారా మనల్ని మనం రక్షించుకుంటాము. మనందరం సంతోషంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన మరియు సమతుల్య పర్యావరణ వ్యవస్థను సృష్టించడం చాలా ముఖ్యం. మనమందరం ఇంట్లో సురక్షితంగా ఉంటూ మన గొంతుకను ప్రపంచానికి వినిపించాలి. మన చేసే పనులు మాటలు మారాల్సి ఉంది. భవిష్యత్తు మనపై ఆధారపడి ఉంది. నీటిని ఆదా చేయండి.. చెట్లను కాపాడండి.. విద్యుత్తును ఆదా చేయండి.. కార్బన్ ఉద్గారాలను తగ్గించండి.. అడవులను కాపాడండి.. మన మహాసముద్రాలను కాపాడండి.. జంతువులను రక్షించండి. మీకు ముఖ్యమైనది ఏమిటో ఎంచుకోండి. ఈ రోజు ప్రారంభించండి. దీన్ని కలిసి చేద్దాం’ అంటూ పోస్ట్ చేసాడు మహేష్ బాబు. ” ఇట్స్ టైం ఫర్ నేచర్.. పర్యావరణాన్ని రక్షించండి సేఫ్ గా ఉండండి” అంటూ అంటూ దలైలామ కొటేషన్ ను సూప‌ర్ స్టార్ మ‌హేశ్ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు.

Mahesh Babu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here