తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేశారు ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్. పలు కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం హర్భజన్ సింగ్ ‘ఫ్రెండ్ షిప్` సినిమా లో హీరోగా నటిస్తున్నారు. తమిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో కీలక పాత్రలలో యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ నటుడు సతీష్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జెపిఆర్ & స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈరోజు ‘ఫ్రెండ్ షిప్` సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్, లోస్లియా మరియనేసన్ కలిసి ఉన్న ఈ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తున్నారు. సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ నటుడు సతీష్, లోస్లియా మరియనేసన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వేల్మురుగన్, రాబిన్, ప్రొడ్యూసర్స్: జెపిఆర్ & స్టాలిన్, దర్శకత్వం: జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య.



