ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘రెడ్’ మూవీ నుండి ‘డించక్’ సాంగ్ ప్రోమో రిలీజ్…..!!!

0
840
Energitic Star Ram Red Movie Dinchak Song Promo

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘రెడ్’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. మాళవిక శర్మ, నివేత పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ‘నువ్వే నువ్వే’ అనే మెలోడియస్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి స్పందన రాబట్టడం జరిగింది. ఇకపోతే నేడు రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ‘డించక్’ అనే పల్లవితో సాగే మాస్ సాంగ్ ప్రోమో ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

రామ్ తో కలిసి యువ భామ హెబ్బా పటేల్ చిందేసిన ఈ ‘డించక్’ సాంగ్ ప్రోమో, ఎనర్జిటిక్ సాంగ్ ని సాకేత్, కీర్తన శర్మ అలపించగా, కాసర్ల శ్యామ్ ఆకట్టుకునే సాహిత్యాన్ని అందించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సాంగ్ రేపు థియేటర్స్ ని ఉపేయడం ఖాయం అని అంటున్నారు రామ్ ఫ్యాన్స్. కాగా ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళుతోంది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here