మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ లో ఈ వారం హైలైట్స్
వైజయంతి మూవీస్ బ్యానర్ పై మెగా మేకర్ సి అశ్వినీదత్ నిర్మాణంలో దర్శకేంద్రులు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, బ్యూటీ క్వీన్ శ్రీదేవిల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా సక్సెస్ఫుల్ గా 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా కవర్ పేజీ తో పాటు సినిమాకు సంబందించిన ఆసక్తికర విశేషాలు. మే 7న పుట్టినరోజు జరుపుకున్న యువ నటుడు సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏ 1 ఎక్స్ ప్రెస్’ ప్రత్యేక పోస్టర్ తో పాటు సందీప్ మూవీ కెరీర్ విశేషాలు. కరోనా సందర్భంగా తమ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో రోగులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన నటసింహం బాలకృష్ణ చెప్పిన విశేషాలు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ లో ఆ పాత్ర కోసం అలియా ని తీసుకోవడం జరిగిందంటూ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి వెల్లడించిన విశేషాలు.
తమ బ్యానర్ నుండి రాబోయే సినిమాల విశేషాలతో పాటు, అందరూ ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచిస్తూ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి సురేష్ బాబు చెప్పిన విషయాలు. గతంలో బాలయ్యతో తీసిన ‘సింహా’, ‘లెజెండ్’ లను మించేలా ప్రస్తుతం ఆయనతో తీస్తున్న సినిమా మరింత గొప్ప విజయాన్ని అందుకుంటుందంటూ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆ సినిమా గురించి చెప్పిన సంగతులు. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’ మూవీ ప్రత్యేక పోస్టర్. మెగాస్టార్ చిరంజీవి కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ‘సీసీసీ’ సంస్థను అభినందించడంతో పాటు, ఇండస్ట్రీ కోసం ఉత్తమమైన పాలసీ తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్న సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన విశేషాలు. మా ఆయీ ప్రొడక్షన్స్ వారి బ్యానర్ పై రూపేష్ చౌదరి, సలోని మిశ్రా హీరో, హీరోయిన్లుగా యువ దర్శకుడు బి శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’22’ మూవీ స్పెషల్ పోస్టర్.
మే 9న బర్త్ డే జరుపుకోబోతున్న విజయ్ దేవరకొండ ప్రత్యేక సిడిపి పోస్టర్ తో పాటు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేస్తున్న సినిమా గురించి విజయ్ వెల్లడించిన విశేషాలు. మెగా హీరో పంజా వైష్ణవ తేజ్ నటిస్తున్న తొలిసినిమా ‘ఉప్పెన’ పోస్టర్. ‘కార్తికేయ – 2’ లో హీరోకి ఎదురైన సమస్య ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉందంటూ దర్శకుడు చందు మొండేటి, ఆ సినిమా గురించి చెప్పిన సంగతులు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’ రాజ్ తరుణ్ బర్త్ డే పోస్టర్. అలానే ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రత్యేక పేజీలతో కూడిన ఈ వారం సూపర్ హిట్ సంచిక ప్రస్తుతం మార్కెట్ లో లభ్యం అవడంతో పాటు, ఇటు ఈ మ్యాగజైన్ రూపంలో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే లేటెస్ట్ సూపర్ హిట్ ఎడిషన్ ని చదవండి పలు సినిమాల లేటెస్ట్ విశేషాలు తెలుసుకోండి….!!