మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ లో ఈ వారం హైలైట్స్……!!

0
1739
ఈ వారం సూపర్ హిట్ ఈ - మ్యాగజైన్

మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ లో ఈ వారం హైలైట్స్.

 మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ల కవర్ పేజి తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు యూట్యూబ్ లో 100 మిలియన్ల ప్రత్యేక పోస్టర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా 21 ఏళ్ళ సినీ ప్రస్థాన విశేషాలు, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ 20 ఏళ్ళ సినీ ప్రస్థానం విశేషాలు, మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన నటుడు రూపేష్ కుమార్ హీరోగా బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 22 పోస్టర్. కరోనా నివారణకు టాలీవుడ్ సినీ ప్రముఖులు అందించిన విరాళాల వివరాలు. తన సోదరులు, అక్క చెల్లెళ్లను ఈ సమయంలో మిస్ అవుతున్నానని, ఈ కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి స్వీయ నియంత్రణే మార్గమని, అలానే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రక్తదానం చేయమంటున్న చిరంజీవి వెల్లడించిన పలు విషయాలు.

ఇటీవల తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోతున్నట్లు ప్రకటించిన ఏస్ డైరెక్టర్ ఎస్ ఏస్ రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ విషయం లో ఎటువంటి కాంప్రొమైజ్ అయ్యే ప్రసక్తి లేదని ఆ సినిమా గురించి చెప్పిన విషయాలు. ‘ఆచార్య’ లో మెగాస్టార్ చిరంజీవి గారిని పవర్ఫుల్ క్యారెక్టర్ లో చూస్తారంటున్న కొరటాల శివ వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలు. ‘బి ద రియల్ మెన్’ అనిపించుకున్న టాలీవుడ్ స్టార్స్ వివరాలు. స్టార్ హీరోయిన్ అనుష్క నిశ్శబ్దం ప్రత్యేక పోస్టర్ తో పాటు తమ సినిమాపై వస్తున్న పుకార్లు నమ్మవద్దని, ఏదైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామంటూ నిర్మాతలు చెప్పిన విషయాలు. రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా గురించి నిర్మాత కేకే రాధామోహన్ తెలిపిన ఆసక్తికర విషయాలు, ఇటీవల సాంగ్స్ తో అదరగొట్టిన పంజా వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఉప్పెన స్పషల్ లుక్ పోస్టర్, మరియు ఆ సినిమాకు సంబందించిన విశేషాలతో కూడిన ఈ వారం సూపర్ హిట్ సంచిక ప్రస్తుతం మార్కెట్ లో లభ్యం అవడంతో పాటు, ఇటు ఈ మ్యాగజైన్ రూపంలో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సూపర్ హిట్ చదవండి పలు సినిమాల లేటెస్ట్ విశేషాలు తెలుసుకోండి….!!

https://superhit.industryhit.com/2646472/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-8th-May-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here