ప్రస్తుతం కరోనా మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ తో పాటు పలు రంగాలకు చెందిన అనేకమంది ప్రజలు ఆర్ధికంగా, అలానే తిండిలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. అటువంటి వారికి ప్రభుత్వం కొంత సాయం అందిస్తుండగా, మేము సైతం ఇటువంటి కష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకుంటాం అంటూ ఇప్పటికే పలు రంగాలకు చెందిన వారితో పాటు సినిమా రంగం నుండి అనేకమంది నటీనటులు ముందుకు వచ్చి విరాళాలు అందించడం జరిగింది. నేడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రూ.1.3 కోట్ల భారీ విరాళం కరోనా బాధితులకు ప్రకటించడం జరిగింది.
కాగా దళపతి విజయ్ 1.3 కోట్ల విరాళం లో పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు, కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 10 లక్షలు, సౌత్ ఇండియన్ ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు రూ. 25 లక్షలు, కర్ణాటక సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 లక్షలు, ఆంధ్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 లక్షలు, పాండిచ్చేరి సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 లక్షలు అందించడం జరిగింది. వీటితో పాటు విజయ్ ఫ్యాన్స్ క్లబ్ తరపున మరికొంత మొత్తాన్ని కరోనా బాధితులకు అందచేయడం జరిగింది….!!