కరోనా విపత్తు నిధికి రూ.5 లక్షల విరాళమిచ్చిన నిర్మాత మోహన్ చెరుకూరి…. !!

0
841
Producer Mohan Cherukuri Announced 5 Lakhs

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి కరాళ నృత్యం చేస్తోంది. దీనితో ఈ మహమ్మారిని త్వరితగతిన తరిమికొట్టాలంటే, ఎక్కడికక్కడ ప్రజలను పూర్తిగా ఇళ్ళకి పరిమితం చేయాలని భావించి పలు ఇతర దేశాలతో పాటు మన దేశాన్ని కూడా కొన్ని వారాల పాటు లాక్ డౌన్ చేసింది మన ప్రభుత్వం. దాని వలన అన్ని రంగాలు కూడా పూర్తిగా మూతపడడం జరిగింది. దానితో ఎందరో ప్రజలు ఇళ్ళనుండి బయటకు వచ్చే పరిస్థితి లేక, చేయడానికి పనులు లేక ఆర్ధికంగా ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరికొందరు దిగువ వర్గాల వారు అయితే కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఎదురయ్యాయి.

అయితే అటువంటి వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రేషన్ తో పాటు కొంత మొత్తాన్ని ఇస్తున్నప్పటికీ, వారితో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తమ దయాగుణంతో ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. ఇక మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి కూడా ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు విరాళాలు అందించగా, మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ప్రారంభించిన కరోనా విపత్తు నిధికి నేడు ప్రముఖ నిర్మాత మోహన్ చెరుకూరి రూ.5 లక్షల విరాళం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం సహా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు మోహన్…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here