ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో మన దేశాన్ని కూడా లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమాల షూటింగ్స్ అన్ని రద్దు కాబడిన నేపథ్యంలో ఈ సినిమా షూట్ కూడా ఆగిపోయింది. కాగా నేడు ఈ సినిమా గురించిన పలు విశేషాలను ఒక తెలుగు పత్రికకు ప్రత్యేకంగా వెల్లడించారు డైరెక్టర్ కొరటాల శివ. మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం,
ఇక చిరంజీవి గారి ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఆయన అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో పాటు, నా పంధాలో ఒక సామజిక అంశాన్ని బేస్ చేసుకుని ఆచార్య సినిమా సాగుతుందని శివ అన్నారు. ఇప్పటికే మా సినిమా 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది, కాకపోతే ప్రస్తుతం ఈ లాక్ డౌన్ వలన సినిమా రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందని, అలానే వచ్చే ఏడాదికి సినిమా వాయిదా పడ్డట్లు ఇటీవల వార్తలు వచ్చాయని, అది తనకు కొంత టెన్షన్ గా అనిపిస్తోందని అన్నారు శివ. ఇక ఈ సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం ముందుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని తీసుకుందాం అని నేను, చిరంజీవి గారు భావించాం, అయితే ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీ గా ఉండడంతో ఎంతవరకు మా సినిమా చేస్తారనేది చెప్పలేని పరిస్థితి అని,
అయితే ఇటీవల చరణ్ కు కథ వినిపించడం జరిగిందని కొరటాల అన్నారు. ఇక కొద్దిరోజుల క్రితం ఈ సినిమా విషయమై సూపర్ స్టార్ మహేష్ గారితో మాట్లాడినపుడు, సినిమా గురించి ఎక్కువ టెన్షన్ పడకండి, అటువంటి ఇబ్బందికర పరిస్థితే వస్తే, మీకు నేనున్నాను భయం లేదు అంటూ అభయమిచ్చారని, అది తనకు కొండంత రిలీఫ్ ని ఇచ్చిందని చెప్పారు. ఎంతో మంచి మనసున్న మహేష్ గారు నేనున్నాను అని నాకు ధైర్యం చెప్పడం నిజంగా ఎంతో గొప్ప విషయం అని, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నట్లు చెప్పారు శివ. ప్రస్తుత పరిస్థితులు చక్కబడి ప్రజలందరూ నార్మల్ స్థితికి వస్తే చాలని, ఆ తరువాత సినిమాల గురించి ఆలోచించవచ్చని కొరటాల చెప్పడం జరిగింది……!!