మాస్ మహారాజ రవితేజ హీరోగా, జ్యోతిక హీరోయిన్ గా కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయిన ‘షాక్’ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హరీష్ శంకర్, అప్పటి నుండి మొన్న వరుణ్ తేజ్ హీరోగా యాక్ట్ చేసిన ‘గద్దలకొండ గణేష్’ వరకు పలు కమర్షియల్ సినిమాలు చేస్తూ, వాటితో సక్సెస్ లు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక అతి త్వరలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ 28వ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు.
కాగా నిన్న ఒక జాతీయ పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన హరీష్, కొన్ని ఆసక్తికర విశేషాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ని తాను ఒక దర్శకుడిగా కాకుండా, ఆయన అభిమానిగా చూస్తానని, అలానే అతి త్వరలో ఆయనతో తీయబోయే సినిమాలో అభిమానులు అందరూ కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని, అందుకోసం ఒక పవర్ఫుల్ సబ్జక్ట్ స్టోరీ చేసినట్లు చెప్పారు. ఇక దాని తరువాత ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నానని చెప్పిన హరీష్, అతి త్వరలో యువ నిర్మాతలైన మహేష్ ఎస్ కోనేరు, బన్నీ వాసులతో కలిసి సినిమా నిర్మాణం కూడా చేపట్టబోతున్నట్లు చెప్పారు. అలానే వీటితో పాటు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాని అన్నారు హరీష్….!!