కరోనా మహ్మమారి రోజు రోజుకి విజృభిస్తోంది. మరోసారి ప్రధాని మోది లాక్ డౌన్ ని మే 3 వరకు కొనసాగిస్తున్నట్లుగా కీలక ప్రకటణ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కి మద్ధత్తు తెలుపుతూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ ఇంటిలో తాను ఈ క్వారంటైన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారో తన ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ట్విట్టర్ లవ్ లో కి వచ్చి మెగా ఫ్యాన్స్ తో ముచ్చట్టించారు వరుణ్ తేజ్. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు వరుణ్ తేజ్.
ప్రశ్న
మీకు ఏ జానర్ ఫిల్మ్స్ నచ్చుతాయి
జవాబు
యాక్షన్ సినిమాలు
ప్రశ్న
చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగబాబు, పవన్ కళ్యాణ్ వీరి గురించి ఒక్కో మాట చెప్పండి
జవాబు
చిరంజీవి – నన్ను ఎంతగానో ఎంకరైజ్ చేస్తారు
నాగబాబు – పిల్లర్ ఆఫ్ స్ర్టెంత్
పవన్ కళ్యాణ్ – హానస్టీకి మరో పేరు
రామ్ చరణ్, అల్లు అర్జున్ – ఇద్దరు ఇద్దరే మంచి హార్డ్ వర్కర్స్
ప్రశ్న
కమర్శీయల్ సినిమాలు ఇష్టమా లేక కంటెంట్ ఉన్న కథల్ని ఇష్టపడతారా
జవాబు
కంచె లాంటి కథ కోసం వెతుకుతున్నా, కంటెంట్ ఉన్న కమర్శీయల్ సినిమాలు చేయాలనుంది
ప్రశ్న
మీకు ఇష్టమైన కామిక్ సూపర్ హీరో
జవాబు
ఎల్లప్పుడూ బాట్ మేన్ కే నా ఓటు
ప్రశ్న
మీకు ఇష్టమైన బాలీవుడ్ హీరో
జవాబు
ఫారుఖ్ ఖాన్
ప్రశ్న
ఈ క్వారంటైన్ లో మీరు ఏం చేస్తున్నారు
జవాబు
స్నూకర్ టేబుల్ ఈ మధ్యనే కొన్న, దాంతో బాగా టైమ్ పాస్ అవుతుంది, అలానే ఆన్ లైన్ లో గిటార్ క్లాసులు తీసుకుంటున్నా, అంతేకాదు నెక్ట్స్ సినిమా కోసం ఓ బాక్సింగ్ కోచ్ నాతోనే ఉంచుకున్నా, ఈ టైమ్ లో ఆ ప్రాక్టీస్ కూడా జరిగిపోతుంది.
ప్రశ్న
మీ లాస్ట్ క్రష్ ఎవ్వరని డైరెక్టర్ హరీశ్ శంకర్ అడిగిన ప్రశ్నకి వరుణ్ సమాధానం..
జవాబు
నా సినిమా గద్దల కొండ గణేశ్ ని డైరెక్ట్ చేసిన హరీశ్ శంకర్ నా లాస్ట్ క్రష్
ప్రశ్న
సాయిధరమ్ తేజ్ తో కలిసి ఏదైనా మల్టీస్టారర్ చేసే అవకాశం ఉందా
జవాబు
కచ్చితంగా చేస్తాను, నేను వెయిట్ చేస్తున్నా మంచి కథ కోసం
ఇక ప్రశ్నలతో పాటు తన అప్ కమింగ్ మూవీ వరుణ్ తేజ్ 10 గురించి ఫ్యాన్స్ అడిగినప్పుడు, ప్రస్తుతం పరిస్థితులు అన్ని సర్థుబాటు అవ్వగానే వీటి 10 గురించి ఓ ఆసక్తికర అప్ డేట్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నామని, ప్రస్తుతానికి మనందరం ఇంటిలోనే ఉంటూ, కుటుంబ సభ్యులతో ఆనందంగా సేఫ్ గా ఉండాలని తెలిపారు వరుణ్ తేజ్



