వాళ్లే నిజమైన హీరోలు, వారికి ప్రత్యేకంగా నా సెల్యూట్ : విక్టరీ వెంకటేష్…!!

0
527
Venkatesh salutes Police for there hardwork

ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తో పలు ఇతర దేశాలతో పాటు మన దేశాన్ని కూడా లాకౌట్ ప్రకటించడంతో ఎక్కడి ప్రజలు అక్కడే పూర్తిగా తమ తమ ఇళ్లలో ఉండిపోవడం జరిగింది. అయితే ఈ విధంగా ఎవరికి వారు తప్పనిసరిగా సామజిక దూరం పాటిస్తే అతి త్వరలో ఈ కరోనాని మన దేశం నుండి తరిమికొట్టవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ లాకౌట్ సమయంలో దేశంలో ఎందరో పోలీసులు తమ కుటుంబాల కంటే ప్రజా రక్షణ కోసమే నిరంతరం పాటు పడుతున్నారు.

అలానే మరోవైపు ఈ మహమ్మారి వ్యాధి బారిన పడుతున్న రోగులకు మెరుగైన చికిత్స అందిస్తూ ఎందరో వైద్యలు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. మనం ప్రస్తుతం జీవిస్తున్న ఇటువంటి విపత్కర సమయంలో ఈ విధంగా ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా ఈ విధంగా సేవలు అందిస్తున్న పోలీసులు, డాక్టర్లు నిజమైన హీరోలని, వారందరికీ ప్రత్యేకంగా నా సెల్యూట్ అంటూ విక్టరీ వెంకటేష్ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేసారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here