మెగాస్టార్ చిరంజీవి సహాయంతో రాజనాల నాగలక్ష్మి ఆపరేషన్ విజయవంతం

0
1634
Megastar help for his fan operation

పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సహాయంతో ఈ రోజు రాజనాల నాగలక్ష్మి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. స్టార్ హాస్పిట‌ల్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎమ్. గోపీచంద్ ఆధ్వర్యంలో సుమారు 3.30 నిమిషాలు ఆపరేషన్ సమయం పట్టింది. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స‌క్సెస్ ఫుల్ గా జరిగింది. ఆపరేషన్ గురించి చిరంజీవి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే వున్నారు. ఆపరేషన్ పూర్తి అవ్వగానే మొదటి ఫోన్ డాక్ట‌ర్.. గోపీచంద్ చిరంజీవి కి తెలియజేసారు.

మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ` డాక్ట‌ర్ గోపీచంద్ గారికి..వాళ్ల బృందానికి ధ‌న్య‌వాదాలు. అలాగే ఈ విష‌యాన్ని స‌మ‌యానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడికి, హైద‌రాబాద్ వ‌ర‌కూ రావ‌టానికి ఏర్పాట్లు చేసిన బి. దిలీప్ గారికి, ఇంతదూరం ప్ర‌యాణించ‌డానికి అనుమ‌తిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల‌కి..ఇత‌ర సిబ్బందికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాని` అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here