నేను డైలమాలో లేను… త్వరలో ‘రెడ్’ మూవీ థియేటర్స్ లోకి వస్తుంది – ఎనర్జిటిక్ స్టార్ రామ్

0
610
Energetic Star Ram Is Not In Dilemma

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘రెడ్’. తమిళ్ లో ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన తడం సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్, హీరోయిన్లుగా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబందించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, అలానే నువ్వే నువ్వే పల్లవితో సాగె ఒక సాంగ్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది.

ఇక ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో షూటింగ్స్ రద్దుకావడంతో రెడ్ మూవీ షూటింగ్ కూడా నిలిపివేయబడింది. అయితే ఈ సినిమా షూటింగ్ నిలిపివేయబడడంతో అతి త్వరలో సినిమాని ఓటిటీ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేసేలా సినిమా యూనిట్ ఒక ఒప్పందం చేసుకుందని నేడు ఒక జాతీయ పత్రికలో వార్తలు రావడంతో, హీరో రామ్ నేడు తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా స్పందించారు. నేను ఎటువంటి డైలమాలో లేను, ప్రస్తుతం గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు అందరివలె ఇంట్లో హాయిగా సేఫ్ గా ఉన్నాను, అలానే అతి త్వరలో లాకౌట్ పూర్తి అయిన అనంతరం మా సినిమా మిగతా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ రామ్ తన ట్వీట్ లో తెలిపారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here