మెగాస్టార్ చిరంజీవి హీరోగా సూపర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా ఎంతో భారీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఆకట్టుకునే కథ, కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే నేడు ‘ఆచార్య’ సినిమా గురించి ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి.
ఇటీవల ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ ఒక కీలక పాత్ర చేయనున్నట్లు వార్తలు వచ్చాయి కదా సర్, అది నిజమేనా అని అడుగగా, వాస్తవానికి మహేష్ పేరు ఎందుకు ప్రచారం అయిందో తనకు అర్ధం కాలేదని, మహేష్ ఎంతో అద్భుతమైన స్టార్ అని, మ హేశ్ తన బిడ్డ లాంటి వాడని, తనతో నటించే అవకాశం వస్తే నిజంగా అద్భుతం అని, కాగా ఈ సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ని తీసుకుందాం అని భావించిన మాట వాస్తవం అని మెగాస్టార్ అన్నారు.
అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న చరణ్, మా సినిమాలో ఎంతవరకు నటిస్తారో చెప్పలేనని, అయితే తన భార్య సురేఖకు మాత్రం మేమిద్దరి కలిసి నటిస్తే చూడాలని ఉందని అన్నారు. కాగా ఈ విషయమై దర్శకులు రాజమౌళి, కొరటాల కలిసి చర్చించిన తరువాతనే పూర్తి క్లారిటీ వస్తుందని మెగాస్టార్ అన్నారు. దర్శకుడు కొరటాలతో పని చేయడం ఒక గొప్ప అనుభూతి అని, తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ సాదిస్తుందనే నమ్మకం ఉందని మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సక్సెస్ పై ఆశాభావం వ్యక్తం చేసారు…..!!