ఈ ఏడాది సంక్రాంతి సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ అందుకుని మంచి జోష్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్, ప్రస్తుతం లాకౌట్ నేపథ్యంలో షూటింగ్స్ అన్ని కూడా రద్దు కావడంతో తన ఫ్యామిలీతో కలిసి గడుపుతున్నారు. ప్రస్తుత తమ ఫ్యామిలీ సంగతులను గురించి నేడు ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన సతీమణి నమ్రత వెల్లడించారు. ముందుగా మేమందరం ఒక మూడునెలల పాటు ఎక్కడైనా టూర్ కి వెళదాం అని భావించాం, అయితే హఠాత్తుగా ఈ కరోనా కోరలు చాచడంతో దానిని విరమించుకున్నాం అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికి వారు పూర్తిగా ఇళ్లకే పరిమితం అవడం మంచిదని, ఈ కరోనా మహమ్మారిని కొందరు తేలికగా తీసుకుంటున్నారు, దయచేసి అలా భావించి నిర్లక్ష్యం వహించొద్దని ఆమె ప్రజలను కోరారు.
ఇక తమ పిల్లలను కూడా ఇంట్లోనే ఉంచి ఈ సమయంలో వారితో మరింత సరదాగా గడుపడంతో పాటు అందరం కలిసి ఉండడంలో అవసరాన్ని వాళ్ళకి తెలియచేస్తున్నాం అని అన్నారు. సినిమాలతో పాటు పిల్లలను ఎంతో ప్రాణంగా ప్రేమించే మహేష్, ప్రస్తుతం తమ పిల్లలిద్దరితో కలిసి సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ, హాయిగా వారితో కబుర్లు చెపుతూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. ఒకరకంగా ఈ సమయం ప్రతి ఒక్క కుటుంబం తమ వారితో మరింత ఆత్మీయంగా కలిసిపోవడానికి వచ్చిన మంచి అవకాశంగా భావించవచ్చని నమ్రత అన్నారు…..!!