ట్విట్టర్ లో చిరంజీవి మోహన్ బాబు సరదా సంభాషణ

0
645
Megastar fun movement in Twitter

మెగాస్టార్ చిరంజీవి, నిన్న ఉగాది పర్వదినం సందర్భంగా పలు సోషల్ మీడియా మాద్యమాల్లోకి అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఎంట్రీ పై పలువురు ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుండగా, కొందరు సినిమా ప్రముఖులు ఆయనను సోషల్ మీడియాకి సాదరంగా స్వాగతం పలుకుతూ తమ అకౌంట్స్ ద్వారా అభినందనలు తెల్పడం జరిగింది. అందులో భాగంగా కలెక్షన్ కింగ్ నటప్రపూర్ణ మోహన్ బాబు, ట్విట్టర్ కి స్వాగతం మిత్రమా అంటూ మెగాస్టార్ని ఉద్దేశించి నేటి ఉదయం ఒక ట్వీట్ చేయగా, కాసేపటి క్రితం ‘రాననుకున్నావా, రాలేననుకున్నావా’ అంటూ సరదాగా మోహన్ బాబు ట్వీట్ ని మెగాస్టార్ రీట్వీట్ చేసారు. దానికి సమాధానంగా మోహన్ బాబు, ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెప్తాను అని రిప్లై ఇచ్చారు.

మొదటి నుండి టాలీవుడ్ లో ఈ ఇద్దరు అగ్రనటుల మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం చిరంజీవి చేసిన ఆ ఫన్నీ ట్వీట్ పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది… !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here