కరోనా వైర‌స్ నివార‌ణ చ‌ర్య‌ల కోసం రూ.20 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్

0
566
Dil Raju 10 Lakhs Donation to both telugu states

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తెలుగు రాష్ట్రాలు పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ పోరాటంలో తమ వంతు సాయం అందించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ క‌రోనా నివార‌ణా చ‌ర్య‌ల కోసం రూ.20ల‌క్ష‌ల విరాళం ఇవ్వ‌నున్న‌ట్లు దిల్‌రాజు, శిరీష్ తెలిపారు.

‘‘క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) కార‌ణంగా అంతర్జాతీయ విప‌త్తు ఏర్ప‌డింది. దీని నివారించ‌డం మ‌న బాధ్య‌త‌. అందుకు తీసుకుంటున్న నివార‌ణా చ‌ర్య‌ల‌కు మ‌న వంతు స‌హ‌కారాన్ని అందించాలి. అది ఎంత చిన్న‌దైన కావ‌చ్చు. అందులో భాగంగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ క‌రోనా నివార‌ణా కోసం తెలంగాణ రాష్ట్రానికి రూ.10 ల‌క్షలు, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ.10 ల‌క్ష‌లు నివార‌ణ చ‌ర్య‌ల నిమిత్తం 20 ల‌క్ష‌లు విరాళం గా అందిస్తుంది. క‌రోనా వైర‌స్ నివార‌ణ కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను అభినందిస్తున్నాం’’ అని దిల్‌రాజు, శిరీష్ తెలిపారు.

20 Lakhs Donation By Dil Raju

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here