జనతా కర్ఫ్యూ కు చప్పట్లతో సంఘీభావం తెలిపిన కృష్ణం రాజు… సెల్ఫ్ క్వారంటైన్ లో ప్రభాస్.

0
708
Krishnam Raju Supports janata kerfew

రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఆయన సతీమణి శ్యామలా కృష్ణంరాజు జనతా కర్ఫ్యూ విజయవంతం అయినందుకు మరియు డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు,పోలీసులు మరియు మీడియా వారికి సంఘీభావ సంకేతంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు చప్పట్ల ద్వారా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు

ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ “కరోనా కష్టాన్ని ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు ప్రధాని మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ అనే పిలుపు తారకమంత్రంగా పని చేసింది. ఈ కార్యక్రమంతో ప్రజలలో కరోనా పట్ల పూర్తిస్థాయి అవగాహన ఏర్పడింది” – అన్నారు.

సెల్ఫ్ క్వారంటెన్లో ప్రభాస్
——————————————–
కాగా ఇటీవలే అమెరికా నుండి తిరిగి వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు ఆయన చెల్లెలు సాయి ప్రసీద (కృష్ణంరాజు పెద్ద కుమార్తె)
సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారట. ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియజేసారు.

ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ” విదేశాల నుండి వచ్చిన వారు తమకు ఎలాంటి అస్వస్థత లేకపోయినప్పటికీ ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి స్వచ్ఛంద గృహనిర్బంధంలోకి వెళ్ళటం వారి బాధ్యత. వారి కుటుంబ సభ్యులు కూడా ఇందుకు పూర్తిస్థాయిలో సహకరించాలి. మా అబ్బాయి ప్రభాస్, అమ్మాయి సాయి ప్రసీద అమెరికా నుండి వచ్చిన వెంటనే అధికారులకు సమాచారం అందజేసి సెల్ఫ్ క్వారంటిన్ లోకి వెళ్లిపోయారు”- అని తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here