విడుదల తేదీ : మార్చి 13, 2020
నటీనటులు : జిపీయస్, కపిలాక్షి మల్హోత్ర, సోనాక్షి, సుమన్, బకెట్ భార్గవ్, జబర్దస్త్ రాజమౌళి,షేకింగ్ శేషు తదితరులు
దర్శకత్వం : మురళీ రామస్వామి
నిర్మాతలు : పీఎస్ రామకృష్ణ(ఆర్కే),
సంగీతం : ఆర్స్,
సినిమాటోగ్రఫర్ : తిరుమల్ రోడ్రిగుజ్,
ఎడిటర్:ఎస్జే శివ కిరణ్.
వెండితెరపై ఇప్పటి వరకూ చాలా రకాల ప్రేమ కథలు వచ్చాయి.. వస్తూనే ఉంటాయి. ఎన్ని ప్రేమ కథలు వచ్చినా వాటిలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ప్రతీ సినిమాలోనూ అంతర్లీనంగా ప్రేమ కథ ఉంటూనే వస్తుంది. అయితే అలాంటి ప్రేమకథ చుట్టూనే తిరిగే సినిమాలంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ అంచనాలు ఉంటాయి. ఒక చిన్న సినిమాగా మొదలయి టైటిల్ దగ్గరనుండి టీజర్, ట్రైలర్, పాటలతో ఈ మధ్యకాలంలో ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన చిత్రం ప్రేమ పిపాసి. మరో కొత్త ప్రేమకథతో ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చింది. మర్చి 13విడుదలయిన ఈ చిత్రం ఎలా ఉందో, ఏ మేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం…
కథ:
ఆవారాగా తిరుగుతూ కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమలో పడేస్తుంటాడు బావ (జిపీయస్). తన అవసరం తీరగానే వారిని వదిలిస్తుంటాడు. అలా అనుకోకుండా బాలా( కపిలాక్షి మల్హోత్రా)ని చూసి ప్రేమిస్తాడు. ఆమె ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆమెకోసం విశాఖపట్నం వెళ్తాడు. అప్పటి వరకు ప్రేమ పేరుతో ఆవారాగా తిరిగిన హీరో ఒక్కసారిగా అమ్మాయి కోసం తన ప్రాణాన్ని పనంగా పెడతాడు. ఇలా కనపడ్డ అమ్మాయి లను వాడుకొని వదిలేసే అతను అమ్మాయిని మాత్రం అంత గాఢంగా ఎందుకు ప్రేమిస్తాడు. చివరకు ఆ అమ్మాయిని దక్కించుకున్నాడా? అసలు హీరో భగ్న ప్రేమికుడుగా ఎందుకు మారాడు అన్నది క్లైమాక్స్. ఈ కథలో సుమన్ పాత్ర ఏంటి? చివరకు ఏమైంది? లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ప్రేమ పిపాసి.
ప్రేమలో ఓడిపోయిన బావ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమయ్యే సీన్స్‌తో ఫస్ట్ హాఫ్‌ను ఓపెన్ చేయడంతో అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించాడు దర్శకుడు. ఇక మెల్లిగా గతంలోకి తీసుకెళ్లడంతో ప్రథమార్థంలో ఊపు పెరిగినట్టుగా అనిపిస్తుంది. అమ్మాయిలను ట్రాప్ చేసే ట్రిక్స్, ఈ కాలంలో అమ్మాయిలు ఎలా ఉన్నారో కళ్లకు కట్టినట్టు చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. శ్రుతీ, కోమలి, కీర్తి అంటూ ఒకరి తరువాత ఒకర్ని ట్రాప్ చేసే సీన్స్‌తోనే ప్రథమార్థం మొత్తం నిండినట్టు అనిపిస్తుంది. సుమన్, బాలా (సోనాక్షి) ఎంట్రీతో ఫస్టాఫ్ ముగుస్తుంది. అయితే యూత్‌ను ఆకట్టుకునే సీన్స్‌తో ప్రథమార్థం ముగుస్తుంది. తన కూతురుని ట్రాప్ చేస్తున్నాడని తెలిసిన సుమన్.. బావను చితక్కొట్టించడం, ఆ సమయంలో బాలాను కనబడటంతో కథలో మలుపు తిరిగిన ఫీలింగ్ వస్తుంది. మధ్యలో వచ్చే జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు చేసే కామెడీ ఆకట్టుకుంది. ప్రేమించిన అమ్మాయి కోసం హీరో కష్టపడి ఎలా ప్రేమలో పడేశాడు. ఆ అమ్మాయి కాదంటే అతను ఎలా ఒప్పించాడు అన్నది సెకండ్ హాఫ్ లో చూపించారు. సెకండ్ హాఫ్ లో సినిమాను లవ్, సెంటిమెంట్ ట్రాక్ లో నడిపించి మెప్పించారు.
అమ్మాయిలను ఫ్లర్ట్ చేసే పాత్రలో, భగ్న ప్రేమికుడుగా హీరో జిపియస్ అద్భుతమైన నటన కనబరిచాడు. ఒక కొత్త హీరోలా కాకుండా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోలా నటించాడు. క్యారక్టర్‌కి తగ్గట్టుగా లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ లో వేరియేషన్స్ చక్కగా చూపించాడు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అదే యాటిట్యూడ్‌తో సినిమాను తన భుజాలపై తీసుకెళ్లాడు. కామెడీ టైమింగ్‌తో, డాన్సులతో పాటు చివరిలో ఎమోషన్ సీన్స్ కూడా బాగా పండించాడు. భవిష్యత్‌లో మంచి హీరో లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఇక సీనియర్ హీరో సుమన్ ఒక ఇంపార్టెంట్ పాత్రలో నటించాడు. హీరో ఫ్రెండ్‌గా ఫన్ బకెట్ భార్గవ్ తనదైన శైలిలో పంచ్ లతో నవ్వించాడు. ఇక జబర్దస్త్ రాజమౌళి, షేకింగ్ శేషు కనిపించేది కొద్దిసేపే అయినా తన పేరడీ పాటలతో థియేటర్లో నవ్వులు పూయించారు. ఐదుగురు హీరోయిన్స్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం:
ప్రేమ పిపాసి సినిమాకు తీసుకున్న లైన్ యూత్‌ను ఆకట్టుకునేది కావడం ప్లస్ పాయింట్. ఈ కాలంలో ప్రేమ ఎలా ఉంది? అమ్మాయిలు-అబ్బాయిలు ఎందుకు ప్రేమించుకుంటున్నారు? దేని కోసం ప్రేమించుకుంటున్నారు? అనే అంశాలతో అల్లుకున్న కథ కావడంతో ఎక్కువ మందికి నచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో అన్నింటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది సంగీతం గురించే. మంచి మాస్ బీట్స్‌తో అందర్నీ మెప్పించారు ఆర్స్. ఇక ఎడిటింగ్ విషయంలో మరికొంత శ్రద్ద తీసుకుంటే బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆర్స్ బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సురేష్ గంగుల సాహిత్యం, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలు అని చెప్పొచ్చు. ఒక పెద్ద సినిమా స్థాయిలో ఫొటోగ్రఫీ, మ్యూజిక్ ఈ సినిమాకి కుదరడం విశేషం. ఇక దర్శకుడు లవ్, ఎమోషన్, ఫ్రస్టేషన్ ప్రతిదీ ఎక్స్‌ట్రీమ్‌లో చెప్పడానికి ప్రయత్నించారు. హీరో క్యారక్టర్ని బాడీ లాంగ్వేజ్‌ని బాగా డిజైన్ చేశాడు దర్శకుడు . డైరక్షన్ ఎంగేజింగ్‌గా ఉంది. నేటి ట్రెండ్‌కి అనుగుణంగానే కాకుండా అడ్వాన్స్డ్గా సినిమా తీశాడు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. అసలు హీరో అమ్మాయి లను ఎందుకు అలా చేస్తున్నాడు అనేది దానికి ఫ్లాష్‌బ్యాక్‌తో మంచి ముగింపు ఇచ్చాడు డైరెక్టర్ ఇందులో లవ్ మాత్రమే కాకుండా ఫ్రెండ్షిప్ , ప్రజెంట్ అమ్మాయిలు ఎలా ఉన్నారు? అనేది కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. బోల్డ్ కంటెంట్ ఉన్నప్పటికీ బ్యాడ్‌గా మాత్రం అనిపించదు. మొదటి సినిమా అయినా నిర్మాతలు ఎక్కడ రాజి పడకుండా సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అయితే బీ, సీ సెంటర్లలో ఈ చిత్రం తప్పకుండా వర్కౌట్ అవుతుంది. మరి కమర్షియల్‌గా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
బాటమ్ లైన్: ప్రజంట్ ట్రెండ్‌కు కనెక్ట్ అయ్యే ప్రేమకథ.
రేటింగ్: 3/5