కన్నడ రాక్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా హోంబేలె ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన సినిమా ‘కెజిఎఫ్ చాప్టర్ – 1′, రెండేళ్ల క్రితం కన్నడ సహా పలు ఇతర భాషల్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యాష్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడ్డ ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం చాప్టర్ – 2 షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ నటులు సంజయ్ దత్ అధీరా పాత్రలో, అలానే రవీనా టాండన్, ప్రధాన మంత్రి రమిక సేన్ పాత్రలో నటిస్తుండగా, టాలీవుడ్ దిగ్గజ నటుడు రావు రమేష్ మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మొదటి భాగంతో పోలిస్తే ఈ రెండవ భాగాన్ని మరింతగా భారీ స్థాయి ఖర్చుతో పాటు మరింత అత్యద్భుతమైన కథ, కథనాలు, యాక్షన్ సీన్స్ తో దర్శకుడు ప్రశాంత్ దీనిని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని రాబోయే అక్టోబర్ 23న దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. చాప్టర్ -1 అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి……!!