ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఎనర్జిటిక్ స్టార్ రామ్, ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెడ్’. తమిళ్ లో ఇటీవల అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న తడం సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ సంపాదించింది. ఈ సినిమా నుండి మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన ‘నువ్వే నువ్వే’ అనే పల్లవి తో సాగే ‘రెడ్’ మూవీ ఫస్ట్ సాంగ్ ని రేపు సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ సభ్యులు కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసారు.
రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ యాక్షన్ థిల్లర్ మూవీలో నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లు గా నటిస్తుండగా, శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!