‘భారతీయుడు – 2’ ప్రమాద ఘటనపై దర్శకులు శంకర్ ఉద్వేగభరిత ట్వీట్…!!

0
268

లోకనాయకుడు కమల్ హాసన్, దర్శక దిగ్గజం శంకర్ ల కలయికలో తెరక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా భారతీయుడు – 2 సినిమా షూటింగ్ లో ఇటీవల ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌ సిటీలో సినిమాకు సంబంధించి సెట్స్‌ వేస్తుండగా ఒక భారీ క్రేన్‌ అమాంతం విరిగి పడడంతో ఈ దారుణ ఘటన సంభవించింది. కాగా ఆ దుర్ఘటనలో దర్శకుడు శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ, ఆహార పదార్ధాల సరఫరాదారు చంద్రన్‌ అక్కడికక్కడే మృతిచెందడం జరిగింది.

ఇక ఆ దుర్ఘటన తో యావత్ చిత్ర సీమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా ఈ ఘటనకు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ అనంతరం హీరో కమల్ హాసన్, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్ధిక సాయం అందించారు. ఇకపోతే నేడు కాసేపటి క్రితం దర్శకుడు శంకర్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఉద్వేగభరితంగా ఒక ట్వీట్ చేసారు. జరిగిన దారుణ ఘటన అనుక్షణం నన్ను కలిచి వేస్తోంది.

ఆ షాక్ పదే పదే గుర్తుకు వస్తూ అప్పటి నుండి నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను, ఒకవేళ ఆ క్రేజ్ మిస్ అయి, వారి మీద కాకుండా నా మీద పడినా బాగుండేది, మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అంటూ శంకర్ ట్వీట్ చేసారు. అయితే శంకర్ చేసిన ఆ ట్వీట్ పై ఆయన ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తూ, జరిగిన దారుణ ఘటన అకస్మాత్తుగా సంభవించింది, కాబట్టి దానిని మీరు పదే పదే గుర్తు చేసుకుని ఆవేదన చెందకండి సర్ అంటూ ఆయనకు ధైర్యం చెప్తున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here