`వలయం` త‌ప్ప‌కుండా ఆడియన్స్ ను థ్రిల్ చేస్తుంది – హీరో, నిర్మాత లక్ష్ చ‌ద‌ల‌వాడ‌!!!

0
987

లక్ష్ హీరోగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్ బ్యానర్ పై పద్మావ‌తి చదలవాడ నిర్మిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘వలయం‘. చదలవాడ బ్రదర్స్ సమర్పిస్తోన్న ఈ చిత్రం ద్వారా రమేష్ కడుముల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దిగంగన సూర్యవంశీ నాయికగా నటించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో మరియు నిర్మాత లక్ష్ ఇంటర్వ్యూ…

ఎలిమెంట్స్ ఉన్న ఫుల్ ప్యాక్డ్ మూవీ!
హీరో భార్య దిశ అనుకోకుండా ఒక రోజు కనిపించకుండా పోతుంది. ఆమె కనిపించకుండా పోవడానికి అసలు కారణం ఎవరు? అనే కోణంలో సినిమా నడుస్తుంది. నా పాత్ర కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. నెగ‌టీవ్ షేడ్స్ ఉన్నాయా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఫుల్ ప్యాక్డ్ మూవీ. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కి నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ ఉంటుంది.

అది కేవలం కో ఇన్సిడెంట్ మాత్రమే!
దిశ ఇన్సిడెంట్ కు మా సినిమాకు సంబంధం లేదు. అది కేవలం కో ఇన్సిడెంట్ మాత్రమే, డైరెక్టర్ స్క్రిప్ట్ రాసినప్పుడే దిశ పేరుతో రాయడం జరిగింది. టైటిల్ కూడా ముందు అదే అనుకున్నాం. దిశ పేరు కొంచెం సాఫ్ట్ గా ఉండటంతో పాటు, లేడీ ఓరియెంటెడ్ మూవీ అనే భావన ప్రేక్షకులలో కలిగే అవకాశం ఉంటుంద‌ని వలయం అని టైటిల్ పెట్టడం జరిగింది. దిశ సంఘటన జరిగేనాటికి మా సినిమా డబ్బింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇలాంటి సున్నితమైన ఘటనను సినిమా ప్రచారానికి వాడుకున్నట్లు ఉంటుందని, హీరోయిన్ పేరు మార్చాలని చూశాం, ఐతే డబ్బింగ్ లో లిప్ సింక్ కాకపోవడంతో అదే పేరు కొనసాగించాల్సివచ్చింది.

మొదటిసారి ఇన్వాల్వ్ అయ్యి నిర్మించిన సినిమా!
చైల్డ్ ఆర్టిస్ట్ గా మూడు సినిమాలు చేశాను, హీరోగా నాలుగు మూవీస్ చేశాను, `బిచ్చగాడు` సినిమాతో నిర్మాతగా మారాను. కంటెంట్ బాగున్న సినిమాలను ఆడియన్స్ బాగా ఆద‌రిస్తున్నారు, వలయం స్క్రిప్ట్ లో కొత్తదనాన్ని కూడా ప్రేక్షకులు ఆస్వాదిస్తారని నమ్మకం ఉంది. నేను మొదటిసారి ఇన్వాల్వ్ అయ్యి నిర్మించిన సినిమా `వలయం`.

మంచి సినిమా తీశామన్న సంతోషం ఉంది!
నిర్మాత‌గా క‌న్నా హీరోగా చేయడం కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే ఈ పాత్ర కోసం 25 కేజీలు బ‌రువు తగ్గాల్సి వచ్చింది. కేవలం సినిమా మీద ఉన్న ఫ్యాషన్ తో మళ్లీ నటించాను. నా రీ ఎంట్రీ కి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుండి సపోర్ట్ ఉంది. వలయం స్క్రిప్ట్ ను డైరెక్టర్ రమేష్ వచ్చి చెప్పాక కొన్ని మార్పులు చేశాం, ఫైనల్ గా మంచి సినిమా తీశామన్న సంతోషం ఉంది.

డాడీ కావాల్సిన సహ‌కారం అందించారు!
ఈ రోజుల్లో సినిమా తియ్యడం సులభం కానీ విడుదల చెయ్యడం కొంచెం కష్టం. నాన్నగారు నన్ను చిన్నప్పటి నుండి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు నటిస్తాను అన‌గానే డాడీ ప్రోత్సహించారు. కావాల్సిన సహ‌కారం అందించారు.

ఎర్లీగా వచ్చి ఎర్లీగా ఇండస్ట్రీకి దూరం అయ్యాను!
నా మొదటి సినిమా ‘నీతో వస్తా’ అందులో రిమా సేన్ హీరోయిన్, నెక్స్ట్ 786 అందులో హంసా నందిని హీరోయిన్ అలాగే మేస్త్రి, శంకర్ చిత్రాలు చేశాను. నేను 16ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చాను, అప్పటి నుండి బ్రేక్ లేకుండా కంటిన్యూ చేయాల్సింది. ఎర్లీగా వచ్చి ఎర్లీగా ఇండస్ట్రీకి దూరం అయ్యాను. బట్ వలయం అనే మంచి స్క్రిప్ట్ తో మ‌ళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది.

బిచ్చగాడు సినిమా ఒక వండర్!
మేము ఇండస్ట్రీలో ఉన్నందుకు దక్కిన గిఫ్ట్ గా బిచ్చగాడు సినిమాను భావిస్తాము. అది ఒక వండర్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నాను త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here