దిల్ త‌ర్వాత అంత ఔట్ అండ్ ఔట్ కామెడి, యాక్ష‌న్ ఉన్న సినిమా భీష్మ – యంగ్ హీరో నితిన్‌

0
793

యంగ్ హీరో నితిన్, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శక‌త్వంలో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం `భీష్మ‌`. ఫిబ్ర‌వ‌రి 21న ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా యంగ్ హీరో నితిన్ మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు మీ కోసం..

త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారు. కంగ్రాట్స్..పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నను ఇక మిమ్మల్ని ఎవరు అడగలేరు ?
– అవును. (న‌వ్వుతూ) ఇక పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న నన్ను ఎవ్వరూ అడగరు. ఫైనల్ గా పెళ్లి అయిపోతుంది కదా.

పెళ్లికి లేట్ అయింద‌నే ఫీలింగ్ ఏమైనా ఉందా ?
– నిజం చెప్పాలంటే చాలా లేట్ అయింది, మూడు సంవత్సరాలు ముందే చేసుకోవాల్సింది. కానీ, పెళ్లి అనేది ఒక పెద్ద అడుగు కాబ‌ట్టి నేను మెంటల్ గా ప్రిపేర్ అవ్వడానికి కొంచెంటైమ్ పట్టింది అంతే…

జనరల్ గా సెలెబ్రెటీ లవ్ స్టోరీ గురించి ముందే తెలుస్తుంది, కాని మీ విషయంలో అలా జరగలేదు. ఎలా మ్యానేజ్ చేశారు ?
– చాలా ప్లాన్డ్ గానే మ్యానేజ్ చేశాం. అంటే, ఆ అమ్మాయి మీద మీడియా అటెంక్షన్ వద్దు అని అనుకున్నాము. ఫైనల్ గా మా లవ్ స్టోరీ చాలా సీక్రెట్ గా పెట్టగలిగాము. మా ఇద్ద‌రి పేరెంట్స్ కూడా అంగీక‌రించారు అందుకే హ్యాపీగా అనౌన్స్ చేశాం. బ్యాచిలర్ లైఫ్ ముగిసిపోతోందంటే …నాకంటే నా తోటి హీరోలు చాలా ఆనందపడుతున్నారు. నాని ‘దా దా’ అంటున్నాడు. రానా, వరుణ్ తేజ్ కూడా కామెట్ చేస్తున్నారు.

వెంకీ కుడుముల మీకు ‘భీష్మ’ కథ ఎప్పుడు చెప్పారు ?
– శ్రీనివాస కళ్యాణం‌ షూటింగ్ జరుగుతున్నటైంలో ఫస్ట్ ‘భీష్మ’ లైన్ చెప్పాడు. ఆ తరువాత ఆ లైన్ ను ఫుల్ స్క్రిప్ట్ గా డెవలప్ చెయ్యడానికి చాలా టైమ్ తీసుకున్నారు. అందులోనూ ఈ సారి నేను పూర్తి స్క్రిప్ట్ లాక్ అయ్యాకే సినిమా మొద‌లుపెట్టాలి అనుకున్నాను. అలా వన్ ఇయర్ లేట్ గా సినిమాని మొదలు పెట్టాము. ఈ మ‌ధ్య‌లో నేను `రంగ్‌దే` సినిమా అలాగే `అంధాదున్‌`మ‌రో సినిమా కూడా స్టార్ట్ చేశాం. లాస్ట్ ఇయ‌ర్ ఖాళీగా ఉన్నాను కాబ‌ట్టి ఈ సంవ‌త్సరం మూడు సినిమాలు చేస్తున్నాను.

‘జయం’ నుండి ఎక్కువగా లవ్ స్టోరీలే చేస్తూ వ‌స్తున్నారు. ఆ జోనర్ బోర్ అనిపించ‌లేదా ?
– నేను చేసిన సినిమాల్లో ఎక్కువగా లవ్ స్టోరీలు ఉన్నా.. కథలు అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివి. అయితే ఇక లవ్ స్టోరీలు తగ్గిద్దాం అనుకున్నాను. కానీ, ‘రంగ్ దే’ కథ విన్నాక లాస్ట్ లవ్ స్టోరీగా ఆ మూవీ చేస్తున్నాను. ఆ కథ చాలా బాగుంటుంది, అందుకే దాన్ని వదులుకోలేదు.

ట్రైల‌ర్ చూస్తే ‘భీష్మ’లో ఆర్గానిక్ కి సంబంధించి మెసేజ్ కూడా ఉందనిపించింది. మరి సినిమా ఎలా ఉండబోతుంది ?
– సినిమా అంతా లవ్ స్టోరీ, రొమాన్సే అండ్ కామెడీనే ఉంటుంది. అయితే, ఒక ఔట‌ర్ లేయ‌ర్‌లో ఆర్గానిక్ స్టోరీ న‌డుస్తుంది. సినిమాలో ఎంటర్ టైన్మెంట్ కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. దిల్ త‌ర్వాత అంత ఔట్ అండ్ ఔట్ కామెడి, యాక్ష‌న్ ఉన్న సినిమా భీష్మ‌.

ట్రైలర్లో ఒక ఫైట్ ‘అతడు’లోని పొలం ఫైట్ ను గుర్తు చేస్తోంది. దాని స్ఫూర్తితో తీశారా?
– కరక్టే. ‘అతడు’లోని పొలం ఫైట్ ను దృష్టిలో ఉంచుకొనే దాన్ని తీశాం. అది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.

సంగీతానికి ప్రాముఖ్యం ఉన్నట్లు కనిపిస్తోంది…
– అవునండీ. మహతి స్వరసాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘వాటే బ్యూటీ’ కానీ, ‘సరాసరి గుండెల్లో’ కానీ, సింగిల్స్ యాంథెం కానీ.. చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగా ఇచ్చాడు.

డాన్సుల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు?
– చివరిగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ఎక్కువ డాన్స్ చేశా. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి కానీ ఎక్కువ డాన్స్ చెయ్యలేదు. ఈ సినిమాకు ముందే అనుకొని డాన్స్ చేసాం. తెరమీద నా డాన్స్ చూసినవాళ్లు కచ్చితంగా ఇష్టపడతారు.

ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది. మీ నుండి వినూత్నమైన సినిమాలు ఆశించొచ్చా ?
– నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ 18 సంవత్సరాలు అవుతుంది. నా కెరీర్ గ్రాఫ్ కూడా చాలా వేరియేషన్స్ తో సాగింది. మంచి ఎక్స్ పీరియన్స్. ఇక నేను కూడా వినూత్నమైన సినిమా చేయాలని ఉద్దేశ్యంతోనే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిగారితో ఓ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ని అలాగే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌ని బ్యాలెన్స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నా..

మీరు, మీ సినిమా ప్రమోషన్ కోసమే పవన్ కళ్యాణ్ పేరును మీరు కావాలని మీ సినిమాలో ఇన్ వాల్వ్ చేస్తారు అనే విమర్శ మీపై ఉంది ?
– లేదు అండి. నా ఫస్ట్ సినిమా జ‌యం నుండి అన్ని సినిమాల‌లో పవన్ కళ్యాణ్ గారి సాంగో, ఆయన పోస్టరో, ఆయన మ్యాడులేషనో ఏదో రకంగా ఆయన నా సినిమాలో కనిపిస్తారు. లేదా వినిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఉన్నది ఫ్యూర్ లవ్. ఎవరు ఎన్ని అనుకున్నా నేను ఆయనకి జెన్యూన్ అభిమానిని.

నిర్మాణ విలువల గురించి ఏం చెబుతారు?
– సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తున్నానంటేనే ఈ బ్యానర్ అంటే ఎంత ఇష్టపడుతున్నానో మీరే ఊహించుకోండి. వీళ్లు తీసే అన్ని సినిమాల్లో నిర్మాణ విలువలు హై లెవల్లో ఉంటాయి. ‘అ ఆ’ మూవీ నుంచి ఈ బ్యానర్ తో నా జర్నీ మొదలైంది. ‘భీష్మ’ తర్వాత మళ్లీ ఇదే బ్యానర్ తో ‘రంగ్ దే’ చేస్తున్నా. దాని తర్వాత కూడా మరో సినిమా చేద్దామని నిర్మాత నాగవంశీ అంటున్నారు.

మీ తదుపరి సినిమాల గురించి ?
– మేర్లపాక గాంధీతో సినిమా చేస్తున్నాను, జూన్ నుండి ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాము. కృష్ణ చైతన్యతో ‘పవర్‌ పేట’ సినిమా కూడా ఆగష్టు నుండి స్టార్ట్ చేస్తాము. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్‌దే’, చంద్ర శేఖర్ యేలేటిగారితో `చెక్` సినిమా చేస్తున్నాను. అన్నీ కొత్త త‌రహా చిత్రాలే.. దేని క‌దే విభిన్నంగా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here