కాంతారావుగారి మాట ప్రకారం నేను ఇప్పటివరకు నేను ఆ తప్పు చేయలేదు – సన్మాన గ్రహీత హీరో సుమన్
ఘనంగా 2026 ‘కత్తి కాంతారావు జాతీయ పురస్కారం’ ప్రధానోత్సవ కార్యక్రమం
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ పోరం ‘మరియు భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా, ప్రతి సంవత్సరం కళా ప్రపూర్ణ కత్తి కాంతారావు జన్మదినోత్సవాన్ని పునస్కరించుకుని గత 24 సంవత్సరాలుగా పలువురు సినీ ప్రముఖులను సన్మానిస్తూ కత్తి కాంతారావు పేరున జాతీయ పురస్కారాలను అందిస్తున్నది. కాగా 2026 జాతీయ పురస్కారానికి గాను ఎంపికయ్యారు నటుడు హీరో సుమన్. దాదాపు 300కు పైగా తెలుగు ..తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించి, పౌరాణిక పాత్రలైన శ్రీవేంకటేశ్వర స్వామిగా.. శ్రీ రాముడిగా …శ్రీకృష్ణుడిగా, యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా, యాక్షన్ చిత్రాల హీరోగా, కరాటే యోధుడు అయిన సుమన్ అనేక పాత్రలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో గొప్ప స్థానం సంపాదించుకున్నసుమన్. ఈ అవార్డు కమిటి చైర్మన్ K.V.రమణా చారి..(IAS). సి.పార్థసారథి. IAS(Rtd) నాగబాల డి. సురేష్ కుమార్ కో చైర్మన్స్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో
అవార్డు కమిటి కో ఛైర్మన్ నాగబాల డి. సురేష్ కుమార్ మాట్లాడుతూ – భారత్ కల్చరల్ అకాడమీ స్తాపించి 29 ఏళ్ళు అయ్యింది. ఈ రోజు తెలుగు టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం, తో కలసి అందిస్తున్న ‘కత్తి కాంతారావు జాతీయ పురస్కారం’ ప్రధానోత్సవ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. ‘కత్తి కాంతారావు జాతీయ పురస్కారం’ ఈ సంవత్సరం సుమన్ గారికి అందించడం సంతోషంగా ఉంది. దాదాపు 300కు పైగా తెలుగు ..తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించి, పౌరాణిక పాత్రలైన శ్రీవేంకటేశ్వర స్వామిగా.. శ్రీ రాముడిగా …శ్రీకృష్ణుడిగా, యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా, యాక్షన్ చిత్రాల హీరోగా, కరాటే యోధుడు అయిన సుమన్ అనేక పాత్రలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో గొప్ప స్థానం సంపాదించుకున్నసుమన్, మూస ధోరణిలో వెళ్తున్న తెలుగు సినిమాకు తన చిత్రాలతో నవ్యత తీసుకొచ్చిన హీరో సుమన్ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు. ఇలాంటి గొప్పవారిని సన్మానించుకోవడం చాల ఆనందంగా ఉంది. అన్నారు.
అవార్డ్ కమిటీ కో ఛైర్మన్ సి.పార్థసారథి ఐఏఎస్ (రిటైర్డ్) మాట్లాడుతూ – హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా సినిమా, సీరియల్స్ చిత్రీకరణలకు హబ్ గా మారింది. ఇతర భాషల చిత్రాల షూటింగ్స్ కూడా హైదరాబాద్ లో విరివిగా జరుగుతున్నాయి. నిజానికి ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించాలి. ప్రతీ ఏడాది వినోద పన్నుల రూపంలో ఎంతో ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని సహాయ సహకారాలు పరిశ్రమకు అందించాలి. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత కాంతారావు గారికి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఈ రోజు యాక్షన్ హీరోగా, గ్లామర్ హీరోగా పేరు తెచ్చుకున్న సుమన్ గారికి ‘కత్తి కాంతారావు జాతీయ పురస్కారం’ అందించడం సంతోషంగా ఉంది. ఆయన అనేక జానర్స్ మూవీస్ తో మనల్ని అలరించారు. అన్నారు.

నటుడు బాబుమోహన్ మాట్లాడుతూ – సుమన్ అన్నను బంగారన్నా అని పిలుస్తా. ఆయన డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేస్తారు. అందంగా ఉంటారు. ఆయన నేను కలిసి ఎన్నో మూవీస్ చేశాం. చాలా మంచి వ్యక్తి. ‘కత్తి కాంతారావు జాతీయ పురస్కారం’ ఆయనకు అందించడం ఎంతైనా సముచితం. జానపద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు కాంతారావు గారు. అన్నారు.
మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి మాట్లాడుతూ – సుమన్ గారు దేశం గర్వించే నటుడు. ఆయన రాముడిగా, వేంకటేశ్వరస్వామిగా మనల్ని ఆకట్టుకున్నారు. శివాజీ సినిమాలో విలన్ వేషం వేసి విలనీకి కొత్తదనం తీసుకొచ్చారు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల ప్రతిభాశాలి. అలాంటి గొప్ప నటుడికి కళాప్రపుర్ణ కాంతారావు గారి జాతీయ పురస్కారం అందించడం ఆనందంగా ఉంది. సినిమా వారికి గద్దర్ అవార్డ్స్ లాగే టీవీ రంగం వారికి కూడా అవార్డ్స్ ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. అన్నారు.
అవార్డ్ గ్రహీత, యాక్టర్ సుమన్ మాట్లాడుతూ – ‘కత్తి’ కాంతారావు ఆయనకు కత్తి ముందు వుంటే నా పేరు చివర తల్వార్ వుంటుంది. తల్వార్ అంటే తెలుసు కదా ‘కత్తి’ ఇది యద్రుచికం గా ఈ రోజు ఈ అవార్డు నన్ను వరించింది. కాంతారావు గారి జాతీయ అవార్డ్ నాకు ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ రోజు నాతో పాటు ఎంతోమంది గొప్ప వాళ్లకు అవార్డ్స్ అందించారు. కాంతారావు గారితో నేను కలిసి చేసిన సినిమాలు తక్కువైనా ఆయనతో ముచ్చటించినపుడు, బాబు సుమన్! నీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకో! నటుడిగా మంచి పేరు సాధించు కాని, సినిమా మాత్రం తీయకు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి నా లైఫ్ లో సినిమా తీసి చాల నష్టపోయాను. సాఫీగా సాగుతున్న నా నటజీవితంలో నిర్మాతగా మారి చేయని తప్పు చేశాను. నీవు కూడా జాగ్రత్త పడు అని చెప్పారు. ఆయన మాట ప్రకారం నేను ఇప్పటివరకు నిర్మాణ శాఖలోకి వెళ్ళలేదు. నేను చిత్ర పరిశ్రమకు వచ్చి 48 ఏళ్లవుతోంది. దాదాపు వెయ్యి చిత్రాల్లో నటించాను. తెలుగులో వంద సినిమాల్లో హీరోగా నటించాను. తమిళం, కన్నడలోనూ హీరోగా నన్ను ఆదరించారు. మీలాగే నేను కూడా జీవితంలో ఎత్తు పల్లాలు చూశాను. అయితే కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. మన పని నిజాయితీగా చేయాలని అనుకుంటా. నన్ను ఇన్నేళ్లుగా అభిమానిస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ పురస్కారం ఘనత దక్కుతుంది. అన్నారు.
ఈ కార్యక్రమంలో మెట్రో దిన పత్రికాధినేత కాళిదాస్ దేవరకొండ, నటి కవిత, వకుళాభరం కృష్ణ మోహన్, ప్రైమ్ 9 టీవీ ఛైర్మన్ రఘువీర్, వి వి కె విజయ్ కుమార్, న్యూస్ రీడర్ విజయ దుర్గ, ప్రొడ్యూసర్ షరీఫ్ మహమ్మద్, న్యూస్ యాంకర్ స్వప్న, సినీ,టి వి నటి జ్యోతి రెడ్డి, ఆర్ జె ఆయుష్ సింగ్, కొరియోగ్రాఫేర్ జానీ మాస్టర్, డి వెంకట రమణ, నటి గాయత్రి భార్గవి, ఆకాంక్ష వేణు మాధవ్,ఎన్ .సత్యనారాయణ,నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ,రామ్ దాస్ నాయుడు, శశిబాల, గిడుగు క్రాంతి కృష్ణ, దర్శకుడు చిత్తరంజన్ దాస్,పి ధన లక్ష్మి, డాన్సర్ రాజేష్, నాట్యగురు ఝాన్సీ లక్ష్మి తదితరులకు విశిష్ట కళా సామ్రాట్ , విశిష్ట సేవా సామ్రాట్ పురస్కారాలను ప్రముఖులకు అందజేశారు.



