ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ మరో చిత్ర నిర్మాణానికి సమాయత్తమైంది. ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ, యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ‘ జంటగా రూపొందిస్తున్న చిత్రమిది.
ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఫిలిం నగర్ లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈనెల 19 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రానికి సంబంధించిన ఇతర నటీ,నట సాంకేతిక వర్గం వివరాలు మరికొద్దిరోజులలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశి.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్h, నిర్మాత: సూర్య దేవర నాగవంశి, దర్శకత్వం: లక్ష్మీసౌజన్య