‘మా పల్లెలో గోపాలుడు, జెంటిల్‌మెన్, ఒకే ఒక్కడు, జైహింద్, పుట్టింటికి రా చెల్లి, హనుమాన్ జంక్షన్ వంటి సూపర్ సక్సెస్‌పుల్ చిత్రాలతో హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానం పొందిన నటుడు అర్జున్ సర్జా. హీరోగానే కాకుండా దేశభక్తి విషయంలోనూ అర్జున్ ప్రథమస్థానంలో నిలుస్తారు. కాగా, అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 10).
ఈ నేపథ్యంలో అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారు. తన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్ర పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.