‘అశ్వద్ధామ’ కు బెస్ట్ విషెస్ చెప్పిన మెగాస్టార్

0
654

యువ నటుడు నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉష మూల్పూరి నిర్మాతగా యువ దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘అశ్వద్ధామ’. మంచి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శౌర్య సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా, శ్రీచరణ్ పాకల సంగీతం అందించిన పాటలు, ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. ఇటీవల సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికెట్ సంపాదించిన ఈ సినిమా, ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా హీరో  యువ నటుడు నాగశౌర్య, ఆయన తల్లిగారైన ఉష, ఇద్దరూ కూడా నేడు మెగాస్టార్ ని కలవడం జరిగింది. అశ్వద్ధామ సినిమా ట్రైలర్ ఎంతో బాగుందని, తప్పకుండా సినిమా కూడా మంచి సక్సెస్ సాదిస్తుందని మెగాస్టార్ అభిలషిస్తూ వారికి ముందస్తు అభినందనలు తెలిపారు. ‘మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాలో ఏదో తెలియని ఒక గొప్ప భావం, అలానే మా సినిమా సక్సెస్ కావాలని బెస్ట్ విషెస్ అందించిన మీకు కేవలం థ్యాంక్స్ అనే మాట ఒక్కటి చెప్తే సరిపోదు సర్,, అందుకే మీరు నిజమైన మెగాస్టార్ అయ్యారు. ఇకపై పై మా సంస్థ నుండి ఇటువంటి మంచి సినిమాలు నిర్మిస్తామని ‘ శౌర్య ,చిరంజీవికి తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెప్తూ పోస్ట్ చేసారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here