క‌మ‌ర్షియ‌ల్‌గా ఉంటూనే టెక్నిక‌ల్‌గా న్యూ యాస్పెక్ట్‌లో ఉండే మూవీ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌` – క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్ రామారావు.

0
616

ఎన్టీఆర్ నుంచి నేటి త‌రం హీరోల వరకు నాలుగు తరాలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నవతరంతో పోటీపడటమే కాకుండా కొన్ని సార్లు వాళ్ళ‌ని దాటీ ప్రయత్నం కూడా చేస్తున్నాను'” అని అన్నారు క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్.రామారావు. ప్ర‌స్తుతం కె.ఎస్‌.రామారావు సమర్పణలో క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా కియేటివ్‌ కమర్షియల్స్ ప‌తాకంపై క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కె.ఎ.వల్లభ నిర్మిస్తోన్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌‘. భిన్నమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌, ఇజాబెల్లె లెయితె, క్యాథరిన్‌ థ్రెసా, రాశీఖన్నా నలుగురు హీరోయిన్స్‌ నటిస్తున్నారు. వేలెంటెన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కులు ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు ఇంట‌ర్వ్యూ..

యంగ్ జనరేషన్ తో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది?
– నవతరానికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు కాబట్టి మనంకూడా కలిసి పనిచేస్తూ వారితో పోటీపడటమే కాకుండా కొన్ని సార్లు వాళ్ళ‌ని దాటీ ప్రయత్నం కూడా చేస్తున్నాను. సహాయ దర్శకుడిగా వర్క్ చేసినప్పటినుండి ఇప్పటివరకూ నేను మూడు నాలుగు జెనరేషన్స్ తో కలిసి వర్క్ చేశాను. అన్ని అడ్వాన్స్ గా మారిపోతున్నాయి అలానే ఇండస్ట్రీ కూడా అడ్వాన్సుడ్ టెక్నాలజీ లోకి వచ్చింది. ఇంకా పెను మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ను ఎంచుకోవడానికి రీజన్ ఏంటి?
– కొత్త తరహా ప్రేమకథతో దర్శకుడు క్రాంతిమాధవ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఒకరితో మరొకరికి సంబంధం లేని నాలుగు జంటల కథ ఇది. ఒక స్వచ్ఛమైన ప్రేమలోని ఫీల్ ను ఆస్వాదించే ప్రతి ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. యువతరానికి ప్రతినిధిగా విజయ్ దేవరకొండ కనిపిస్తారు. రాశీఖన్నా బోల్డ్ గా కనిపిస్తే ఐశ్వర్యారాజేష్ పాత్ర సహజంగా సాగుతుంది. ఇజాబెల్లె, క్యాథరిన్‌ పాత్రలు ఆడియన్స్ ని అలరించే విధంగా ఉంటాయి.

విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు?
– పెళ్లి చూపులు’ సినిమాలో విజయ్ దేవరకొండ అభినయం చూడగానే ఒక ప్రత్యేకమైన ఆర్టిస్ట్ లాగా అనిపించారు. మనకు ప్రత్యేకమైన ఆర్టిస్టులు చాలా తక్కువమంది ఉంటారు. ఉదాహరణకి రవి తేజ, కన్నడలో ఉపేంద్ర, తమిళ్ లో విజయ్ సేతుపతి ఇలా ప్రత్యేకమైన నటుడనిపించింది. అందుకనే అతడితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. తర్వాత అతన్ని కలిసి కథ చెప్పగానే తనకి నచ్చడంతో విజయ్ దేవరకొండతో ఈ సినిమా కన్ఫర్మ్ చేశాం.

క్రాంతి మాధవ్ ఈ కథ చెప్పినప్పుడు మీరెలా ఆలోచించారు?
– క్రాంతి మాధవ్ బాగా చదువుకున్న వ్యక్తి. మణిపాల్ యూనివర్సిటీ లో మాస్ మీడియా చేసి ఒక విభిన్న తరహా చిత్రాలనే చేస్తూ వస్తున్నారు. అలా మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆతర్వాత మా బేనర్ లో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా చేశాడు. సినిమా అభిమానులు క్రాంతి మాధవ్ సినిమాకి వెళితే నిజంగా ఇది చాలా బాగుందే చక్కగా తీశాడు అనే ఫీలింగ్ వచ్చేలా చేసే మంచి టెక్నీషియన్ అతను. విజయ్ దేవరకొండ పాత్రలో భిన్న పార్శ్వాలుంటాయి. అతడి లుక్ పరంగా వైవిధ్యత చూపించడం, నలుగురు హీరోయిన్లతో భిన్న కాలాల్లో తెరకెక్కించాల్సిన కథ కావడంతో విడుదలలో కొంత జాప్యం జరిగింది.

అభిషేక్ నామా గురించి?
– అభిషేక్ నామా కూడా నాతోటి నిర్మాత. నా మీద ఉండే నమ్మకంతోనో లేక నా మీద ఉన్న గౌరవం తోనో ఈ సినిమా చేశారు. ఇంకో కారణం విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలకు ఉంటుంది. నా ద్వారా ఈ సినిమాలో భాగం అయితే బాగుంటుంది అని ఆంధ్ర ఏరియాకి తీసుకోవడం జరిగింది. అలాగే నైజాం ఏరియాలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేసిన సునీల్ నారంగ్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

మీ అబ్బాయి వల్లభ ఈ సినిమా షూటింగ్ లో యాక్టీవ్ గా వర్క్ చేశారు కదా..
– అతను గతంలో హీరోగా చేశాడు కదా నేనుఅయితే ఎలా చేసేవాడిని అనే ఫీలింగ్ లోనే ఉంటాడు(నవ్వుతూ). ఫారెన్ షెడ్యూల్ మొత్తం తనే దగ్గరుండి చూసుకున్నాడు.

ఈ సినిమాలో కూడా బోల్డ్ కంటెంట్ ఉంటుందా?
– మా సంస్థ విలువలకు కట్టుబడి న్యూ ట్రెండ్ కు అనుగుణంగా వాణిజ్య హంగులతో సినిమాను రూపొందించాం. అందాన్ని సభ్యతతో చూపించడం చాలా ముఖ్యం. అందులో అశ్లీలత కనిపించకూడదని నేను నమ్ముతాను. అందుకే ఈ సినిమాలో ఎలాంటి అసభ్యత ఉండదు. క్రాంతి మాధవ్ తీసిన ఒక చక్కటి లవ్ స్టోరీ.

మీ బేనర్ లో నెక్స్ట్ మూవీ?
– త్వరలో మా బేనర్లో నాని హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే ఇంకా కొన్ని సినిమాలకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.

పంపిణీ వ్యవస్థలో ఈ మధ్య కాలంలో మీరు గమనించిన మార్పులేంటి?
– మోనోపోలీ పెరుగుతోంది. ముగ్గురు, నలుగురు చేతుల్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. దాంతో కొంతమంది నిర్మాతలకు లాభం జరిగితే చాలా మంది నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. తమకు కావాల్సిన కొంత మందికి థియేటర్లు కేటాయించడం వల్ల ఇండిపెండెంట్ గా సినిమా తీసి విడుదల చేయాలని భావించే నిర్మాతలకు న్యాయం జరగడం లేదు. దీనిపై నిర్మాతలంతా ఆలోచించాలి. ఈ సమస్యలు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశముంది. కంటెంట్ ను తయారుచేసే నిర్మాత కంటే ఆ కంటెంట్ ను జనాల్లోకి తీసుకెళ్లే క్యూబ్, యూఎఫ్ వో లాంటి సంస్థలే ఎక్కువగా డబ్బును గడిస్తున్నాయి. ఈ విధానం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు. సానుకూల దృక్పథంతో అందరూ కలిసిపోయినప్పుడే చిత్రసీమకు మంచి జరుగుతుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె. ఎస్ రామారావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here